Mannara Chopra: నటి మన్నారా చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలె హిందీ బిగ్‌బాస్‌లో మెరిసిన ఈ బ్యూటీ టాలీవుడ్‌ డైరెక్టర్‌  ముద్దు పెట్టిన సంఘటనతో హాట్‌టాపిక్‌ అయ్యింది. 'సీత' సినిమాలో కాజల్‌ అసిస్టెంట్‌గా చేసిన ఆమె ఓ సినిమాలో లీడ్‌ రోల్లో నటించింది. ఆ మూవీ ప్రమోషన్లో భాగంగా ఈవెంట్‌కు హాజరైన ఆమెను టాలీవుడ్‌ డైరెక్టర్‌ ఏఎస్‌ రవికుమార్‌ అందరికి ముందే ఆమెకు ముద్దు పెట్టాడు. అప్పట్లో ఈ వీడియో సంచలనమైంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ, రచ్చ జరిగింది. రీసెంట్‌గా హిందీ బిగ్‌బాస్‌ 17 సీజన్‌లో పాల్గొన్న ఆమె టాప్‌-3 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది.


ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ ఎయిర్‌లైన్‌ సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ సోషల్‌ మీడియా వేదికగా మండిపడింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేస్తూ.. "ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది తీరుతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. నాకు ఇలా జరగడం ఇది రెండోసారి. నేను ప్రయాణించిన ఎయిర్‌లైన్స్‌లో @AkasaAir అత్యంత చెత్తది. గతంలో ఒకసారి నా బ్యాగ్‌ను డ్యామేజ్‌ చేశారు. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పిన పట్టించుకోలేదు. పైగా నాతో చాలా దురుసుగా ప్రవర్తించారు" అంటూ సదరు సంస్థను ట్యాగ్‌ చేసింది. దీంతో ఆమె ట్వీట్‌పై సదరు సంస్థ స్పందించింది. 






మన్నారా ట్వీట్‌కు @AkasaAir ఇలా వివరణ ఇచ్చింది. "మన్నారా, మీకు కలిగిన ఇబ్బందికి మేము చింతిస్తున్నాం. మీ అదనపు బ్యాగేజీ రుసుము విధానాన్ని మిమ్మల్ని కలిసిన మా టీం విమానాశ్రయంలోనే వివరించి ఉంటుందని మేము అర్థం చేసుకున్నాం. కానీ, కొన్ని నిబంధనల దృష్ట్యా మీ రుసుమును మాఫీ చేయలేము. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశీస్తున్నాము. అయితే ఇతకుముందు ఏవైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి. ఆ వివరాలు ఇవ్వండి. మేము వాటిని పరిష్కరిస్తాం" అంటూ ఆమె పోస్ట్‌కు రిప్లై ఇచ్చింది. దీనిపై మన్నారా స్పందిస్తూ సదరు సంస్థ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేసింది.


"మీరు ఏం అంటున్నారు సార్‌.. మీ సిబ్బంది నాతో చాలా దురుసుగా ప్రవర్తించింది. ఈ రోజు ఉదయం నాకు ఆరోగ్యం బాగా లేదు. ఈ విషయాన్ని మీ సిబ్బంది దృష్టికి కూడా తీసుకువెళ్లాను. కానీ ఆమె చాలా బాగా నటిస్తూ మీరు వెళ్లి మా మేనేజర్‌తో మాట్లాడండి అని చెప్పింది. కానీ మీ మేనేజర్‌ కూడా నా బాధను అర్థం చేసుకోలేదు కదా కనీసం సమస్యను పరిష్కరించాలని కూడా అనుకోలేదు"  అంటూ ఆమె మండిపడింది. కాగా మన్నారా థ్రిల్లర్‌ జిద్‌ అనే మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో 'తిరగబడరా సామీ' సినిమాలో నటిస్తుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు కాగా ఆమె సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. మరో హీరోయిన్‌గా మాల్వీ మల్హోత్రా నటించనుంది.  సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుకుంటుంది.