Varun Dhawan Become Father: బి-టౌన్‌ స్టార్‌ హీరో గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తండ్రి కాబోతున్నట్టు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చాడు. పెళ్లయిన మూడేళ్లకు ఈ యంగ్‌ హీరో శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్‌ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ఒకరు. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ మూవీతో బాలీవుడ్‌ ఆరంగేట్రం చేసిన అతడు బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలో తన చిన్ననాటి స్నేహితురాలు, డిజైనర్ నటాషా దలాల్‌తో 2021 జనవరి 24న ఏడడుగులు వేశాడు. అలీబాగ్​లోని మాన్సస్ హౌస్ రిసార్ట్​లో ఇరుకుటుంబసభ్యులు, కొద్దిమంది సన్నిహితులు, బంధువుల మధ్య గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది.


ఇక పెళ్లయి మూడేళ్లు దాటిన ఇప్పిటికీ ఈ హీరో నుంచి శుభవార్త రాలేదు. దాంతో  గుడ్‌న్యూస్‌ ఎప్పుడు చెబతావంటూ వరుణ్‌కు తరచూ ప్రశ్న ఎదురవుతుండేది. ఈ క్రమంలో తాజాగా ఈ హీరో త్వరలోనే తమ ఇంట్లోకి ఓ బుజ్జి పాపాయి రాబోతుందంటూ ఆఫీషియన్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన భార్య నటషా బేబి బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్‌ చేశాడు. దీనికి "మేము ప్రెగ్నెంట్‌.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి" అంటూ తన భార్య బేబీ బంప్‌ను ముద్దాడుతున్న ఫొటోను షేర్‌ చేశాడు. దీంతో వరుణ్‌-నటషా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌, సమంత, మలైక ఆరోరా, మనీష్‌ పాల్‌, అర్జున్‌ కపూర్‌తో పాటు ఇతర నటీనటులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్‌ పెడుతున్నారు.


Also Read: హీరోయిన్‌తో ఎయిర్‌లైన్‌ సిబ్బంది అసభ్య ప్రవర్తన - అత్యంత చెత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటూ మండిపడ్డ నటి


అయితే గతంలో వరుణ్‌ తండ్రి  కాబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 2022లో సినిమా ప్రమోషన్ కోసం హిందీ బిగ్‌బాస్ షోకు వెళ్లిన అతడిని హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ ఆటపట్టించాడు. సల్మాన్‌ బొమ్మను వరుణ్‌ చేతిలో పెట్టిన ఇది నీ పిల్లాడికోసమే.. అంటూ వ్యాఖ్యానించాడు. దాంతో నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు సమాధానం ఇచ్చాడు. ‘ఈ బొమ్మను ఇంటికి తీసుకెళ్లు త్వరలో నీ ఇంటికి ఓ బాబో.. పాపో వస్తుంది’ అని సల్మాన్ సరదాగా అన్న మాటలను నెటిజన్లు నిజం అనుకున్నారు. దీంతో త్వరలోనే వరుణ్‌ తండ్రి కాబోతున్నాడుంటూ రెండేళ్ల క్రితమే అతడిని తండ్రిని చేశారు. కానీ అందులో నిజం లేదని కొద్ది నెలలకు తేలిపోయింది. అలా రూమర్స్‌ వినిపించిన రెండేళ్లకు తాజాగా వరుణ్‌ గుడ్‌న్యూస్‌ చెప్పడం విశేషం.






ఇదిలా ఉంటే వరుణ్‌ ధావన్‌ ప్రస్తుతం సిటాడెల్‌ ఇండియన్‌ వెర్షన్‌ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుకుంటుంది. మరోవైపు మూవీ టీం ప్రమోషన్స్‌ని కూడా నిర్వహిస్తుంది. ఇక గతేడాది బవాల్‌ చిత్రంతో ప్రేక్షఖులను అలరించాడు వరుణ్‌. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ అతడి సరసన హీరోయిన్‌గా నటించింది. నేరుగా ఓటీటీ రిలీజైన ఈ సినిమా మంచి ప్రేక్షక ఆదరణ అందుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుణ్‌ బాలీవుడ్‌ డైరెక్టర్‌ అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహిస్తున్న స్ట్రీ-2 అనే హారర్‌ సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు తమిళ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కిస్తున్న బేబీ జాన్‌ చిత్రంలో కూడా కనిపించనున్నాడు.