Raayan First Look: 'రాయన్'గా ధనుష్, గుండుతో ఫస్ట్ లుక్ అదుర్స్!

Dhanush - Raayan First Look: ధనుష్ స్వీయ దర్శకత్వంలో D50 అనే ఓ సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.

Continues below advertisement

Dhanush - Raayan First Look: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నారు. ఇటీవలే 'కెప్టెన్ మిల్లర్' అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నారు. ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జునతో కలిసి DNS మూవీలో నటిస్తున్నారు. దీంతో పాటుగా తన స్వీయ దర్శకత్వంలో D50 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయటంతో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. 

Continues below advertisement

ధనుష్ కెరీర్ లో మైలురాయి 50వ చిత్రానికి 'రాయన్' అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో ధనుష్ సరికొత్త గెటప్ లో కనిపించారు. గుబురు మీసాలు, గుండుతో మాసీ లుక్ లో ఆకట్టుకున్నారు. ఇందులో ధనుష్ తో పాటుగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, మలయాళ నటుడు కాళిదాస్ జయరామ్ కూడా ఉన్నారు. ముగ్గురూ చేతిలో ఆయుధాలను పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తూ ఉన్నారు.

'రాయన్' చిత్రానికి హీరో ధనుష్ కథ రాయడమే కాదు, దర్శకత్వం వహిస్తున్నారు. 2017లో 'పవర్ పాండి' అనే సినిమాతో దర్శకుడి అవతారమెత్తిన విలక్షణ నటుడు.. ఇన్నేళ్ల తర్వాత తన గోల్డెన్ జూబ్లీ మూవీ కోసం మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఓం ప్రకాశ్ సినిమాటోగ్రాఫర్ గా, ప్రసన్న ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ చిత్రానికి శ్రేయాస్ శ్రీనివాసన్ ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. 

'రాయన్' చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు. 2024లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా నటించే ఇతర ప్రధాన నటీనటులను మేకర్స్ వెల్లడించలేదు. అయితే ఇందులో నిత్యా మీనన్, అపర్ణ బాలమురళి, అనికా సురేంద్రన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దర్శక నటుడు ఎస్ జె సూర్య విలన్ పాత్ర పోషిస్తారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలో నటించే ఇతర ప్రధాన నటీనటుల వివరాలపై క్లారిటీ రానుంది. 

తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న తమిళ్ హీరోలలో ధనుష్ ఒకరు. రఘువరన్‌ బీటెక్, 3, అనేకుడు, మారి, తిరు వంటి సినిమాతో తెలుగులో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ కోలీవుడ్ స్టార్ హీరో.. 'సార్' సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఎంట్రీతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో DNS అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఇది ఆయన కెరీర్ లో 51వ చిత్రం కానుంది. దాని కంటే ముందుగా 'రాయన్' మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. మరి ఈ చిత్రాలు ధనుష్ కు ఎలాంటి విజయాలు అందిస్తాయో వేచి చూడాలి.

Also Read: కలెక్షన్స్ వసూళ్లలో ‘ఈగల్’ ఢమాల్ - రవితేజను వెంటాడుతోన్న ఫ్లాప్స్, నష్టం ఎంతంటే?

Continues below advertisement