విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) కథానాయకుడిగా 'హిట్' దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'సైంధవ్' (Saindhav Movie). క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబర్ 22న విడుదల కానుంది. వెంకటేష్ 75వ చిత్రమిది. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 'శ్యామ్ సింగ రాయ్' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయ్యింది.


ఎనిమిది మంది నటీనటులు... 
మొత్తం పదహారు రోజుల పాటు
Saindhav Movie Climax Wrapped Up : 'సైంధవ్' పతాక సన్నివేశాల చిత్రీకరణ ఇటీవల పూర్తి చేసినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ''సుమారు పదహారు రోజుల పాటు కీలకమైన షెడ్యూల్‌ జరిగింది. ఎనిమిది మంది నటీనటులు పాల్గొనగా... హై - ఆక్టేన్ ఎమోషనల్ క్లైమాక్స్‌ చిత్రీకరించారు. రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో యాక్షన్ దృశ్యాలు తెరకెక్కించారు. వెంకటేష్ కెరీర్ చూస్తే... ఇప్పటి వరకు తీసిన క్లైమాక్స్‌లలో భారీ ఖర్చుతో తీసిన క్లైమాక్స్ ఇది'' అని చిత్ర బృందం పేర్కొంది. 


Also Read : చిరంజీవికి డబ్బే ముఖ్యమైతే 'ఆచార్య'కు తిరిగి ఇస్తారా? 'ఏజెంట్'కు అనిల్ సుంకర ఇచ్చారా?



'సైంధవ్'లో ముగ్గురు హీరోయిన్లు!
'సైంధవ్' సినిమాలో మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath New Telugu Movie) నటిస్తున్నట్లు దర్శక - నిర్మాతలు తెలిపారు. అభినయానికి ఆస్కారమున్న పాత్ర అని చెప్పారు. మూడేళ్ళ విరామం తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ చేస్తున్న తెలుగు చిత్రమిది. వెంకటేష్ జోడీగా ఆవిడ కనిపించనున్నట్లు సమాచారం. శ్రద్ధా శ్రీనాథ్ కాకుండా ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. 


సుశాంత్ 'చిలసౌ', విశ్వక్ సేన్ 'హిట్' సినిమాల ఫేమ్ రుహానీ శర్మ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మరో కీలక పాత్రలో ఆండ్రియా జెరెమియా నటిస్తున్నారు. రేణూ దేశాయ్ డాక్టర్ పాత్ర చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 22న సినిమాను విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం వెల్లడించారు.


Also Read : రజనీకాంత్ దూకుడు - 'జైలర్'కు 3 రోజుల్లో బాక్సులు బద్దలయ్యే కలెక్షన్స్


గత కొన్నేళ్ళుగా ప్రతి సినిమాలోనూ వెంకటేష్ దాదాపు ఒకే తరహా లుక్ మైంటైన్ చేస్తున్నారు. మధ్యలో సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ లో కనిపించినా... చాలా రోజులుగా హెయిర్ స్టైల్ చేంజ్ చేయలేదు. 'సైంధవ్' కోసం ఆయన హెయిర్ స్టైల్ చేంజ్ చేసినట్టు ఆల్రెడీ విడుదల చేసిన లుక్ చూస్తుంటే తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కానుంది. ‘శ్యామ్ సింగ రాయ్’ తర్వాత నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. హిట్‌వర్స్ కాకుండా కొత్త కథతో శైలేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, సినిమాటోగ్రఫీ : ఎస్. మణికందన్, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీత దర్శకుడు : సంతోష్ నారాయణన్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial