Aakhri Sach Trailer : ఇన్వెస్ట్ గెటివ్ ఆఫీసర్ గా తమన్నా - ఆకట్టుకుంటున్న 'ఆఖరి సచ్' వెబ్ సిరీస్ ట్రైలర్

'జైలర్', 'భోళాశంకర్' సినిమాలతో తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన తమన్నా. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ తో ఆడియన్స్ను అలరించబోతోంది.

Continues below advertisement

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉంది. ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీల్లోనూ సందడి చేస్తోంది. రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ ఓటీటీ ప్రాజెక్టులు చేసింది. స్టార్ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూనే... 'జీ కర్దా', 'లస్ట్ స్టోరీస్ 2' వంటి వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తమన్నా నటించిన 'జైలర్', 'భోళాశంకర్' సినిమాలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. ఇంతలోనే మరో విభిన్న తరహా వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Continues below advertisement

తమన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటిస్తున్న వెబ్ సిరీస్ 'ఆఖరి సచ్' (Aakhri Sach). ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణించగా... వాటి వెనుక ఉన్న రహస్యాలను కనుగొనే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఈ వెబ్ సిరీస్ లో తమన్నా కనిపించనుంది. ఇక విడుదలైన ట్రైలర్ ని గమనిస్తే... 11 మంది తమ ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపిస్తారు. తమన్నా టీం ఈ మరణాల గురించి దర్యాప్తు చేయడం ఈ ట్రైలర్లో కనిపిస్తోంది. ఇంటెన్సిటీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సీరియస్ గా ట్రైలర్ ఉంది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 25న విడుదల కానుంది. 2018లో ఢిల్లీలోని బురారిలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది చనిపోయారు. ఇప్పటికే ఈ సంఘటనను ఆధారంగా చేసుకొని 'హౌస్ ఆఫ్ సీక్రెట్స్' పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్ రూపొందించింది నెట్ ఫ్లిక్స్. ప్రస్తుతం అది ఓటీటీలో అందుబాటులోనే ఉంది.

తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ 'ఆఖరి సచ్' వెబ్ సిరీస్ డాక్యుమెంటరీ కాదు. బురారి ఘటనను స్టోరీ లైన్ గా తీసుకొని దానికి కొన్ని ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి వెబ్ సిరీస్ గా రూపొందించారు. దీనికి రాబి గ్రేవెల్ దర్శకత్వం వహించగా... సౌరవ్ దేవ్ కథ అందించారు. నిర్వికార్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ లో తమన్నాతో పాటు అభిషేక్ బెనర్జీ, శివాని నారంగ్, దనిష్ ఇక్బాల్, నిషు దీక్షిత్, సంజీవ్ చోప్రా, కృతి విజ్, నిఖిల్ నంద, రాహుల్ బగ్గ కీలక పాత్రలు పోషించారు. 'జీ కర్దా', 'లస్ట్ స్టోరీస్ 2' వంటి బోల్డ్ వెబ్ సిరీస్ ల తర్వాత తమన్నా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కావడంతో 'ఆఖరి సచ్'పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది.

గతంలో తమన్నా 'నవంబర్ స్టోరీ', 11th అవర్' వంటి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో నటించగా.. ఆ వెబ్ సిరీస్ లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి తరహాలోనే ఈ 'ఆఖరి సచ్' వెబ్ సిరీస్ ఉండబోతోంది. మరి ఈ వెబ్ సిరీస్ తో తమన్నా ఎలాంటి సక్సెస్ను అందుకుంటుందో చూడాలి. మరోవైపు తమన్నా హీరోయిన్గా నటించిన 'జైలర్', 'భోళాశంకర్' సినిమాలు ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో 'జైలర్' తమిళం తో పాటు తెలుగులోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుండగా.. 'భోళాశంకర్' మాత్రం విడుదలైన మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకొని మంచి ఓపెనింగ్స్ ను అందుకున్నా రెండో రోజు నుంచి కలెక్షన్స్ భారీగా పడిపోయాయి.

Also Read : 'సలార్ 2' కి ముందే 'కేజీఎఫ్ 3' - ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదేనట!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement