Sai Pallavi And Allu Aravind Dance In Thandel Thank You Meet In Srikakulam: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'తండేల్' (Thandel) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. దీంతో మూవీ టీం ఫుల్ జోష్‌లో ఉంది. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో గురువారం సాయంత్రం థాంక్యూ మీట్ (Thank You Meet) నిర్వహించింది. ఈ వేడుకలో నటి సాయిపల్లవితో (Sai Pallavi) కలిసి నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) డ్యాన్స్ చేశారు. మూవీలోని 'హైలెస్సా హైలెస్సా' పాటకు స్టెప్పులేసి జోష్ నింపారు. అంతకు ముందు నాగచైతన్య, సాయిపల్లవి సైతం డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ సినిమాను ఇంతలా ఆదరించినందుకు ప్రేక్షకులకు మూవీ టీం కృతజ్ఞతలు తెలిపింది. కాగా, చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'తండేల్' కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.
ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు చేసిన సినిమా అతి త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌కు దూసుకెళ్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాత బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మించారు. శ్రీకాకుళం జిల్లా కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి పొరపాటున పాక్ సముద్ర జలాల్లోకి వెళ్లగా.. అక్కడి అధికారులు వీరిని జైల్లో వేస్తారు. ఈ వాస్తవ ఘటనలకు లవ్ స్టోరీ, ఎమోషన్స్, దేశభక్తిని మిక్స్ చేసి దర్శకుడు చందు మొండేటి 'తండేల్'ను అద్భుతంగా తెరకెక్కించారు. సాయిపల్లవి, నాగచైతన్య నటనలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఈ నెల 7న సినిమా విడుదల కాగా.. ఆ రోజు నుంచే మంచి టాక్‌తో సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
Also Read: జియో హాట్‌స్టార్ సేవలు ప్రారంభం.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ధరలు చూశారా
'తెరపైకి కోడి రామ్మూర్తి జీవితం'
అటు, ఈ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్ కీలక ప్రకటన చేశారు. మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడి జీవితం ఆధారంగా సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ తాము ఎప్పటికైనా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. వెబ్ సిరీస్‌గా తీయాలనే ఉద్దేశంతో రామ్మూర్తి చరిత్రను కొంత స్టడీ చేసినట్లు తెలిపారు. శాకాహారి అయిన రామ్మూర్తి శారీరక ధారుఢ్యంలో ఎందరికో స్ఫూర్తి అని ప్రశంసించారు. నిజానికి చాలా కాలం నుంచి టాలీవుడ్‌లో కోడి రామ్మూర్తి బయోపిక్ గురించి చర్చ నడుస్తోంది. గతంలోనూ టాలీవుడ్ హల్క్ రానా కోడి రామ్మూర్తి బయోపిక్‌లో నటించాలని ఉందని చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Also Read: నన్ను తొక్కేయాలని, నలిపేయాలని చూస్తారా? విష్ణు మీద ఇన్ డైరెక్టుగా మంచు మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్