Jio Hotstar Subscription Price | రిలయన్స్‌ సంస్థకు చెందిన జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ విలీనం పూర్తయింది. ఈ రెండు కలిసి జియో హాట్‌స్టార్‌ (JioHotstar)గా లాంఛ్ చేశారు. గతంలో డిస్నీ + హాట్‌స్టార్ కోసం సపరేట్ సబ్‌స్క్రిప్షన్, జియో సినిమా కోసం వేరేగా సబ్ స్క్రైట్ చేసుకోవాల్సి వచ్చేది. జియో సినిమా, డిస్నీ హాట్ స్టార్ విలీనమై జియో హాట్‌స్టార్‌గా విలీనం కావడంతో నేటి నుంచి దీని సేవలు అందుబాటులోకి వచ్చాయి. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లో వచ్చే కంటెంట్‌ ఇకనుంచి ఒకేచోట చూసేయండి. 

వీటి విలీనంతో ఓవరాల్‌గా యూజర్ బేస్ 50 కోట్లకు పెరిగింది. భారత్ మార్కెట్లో అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ సేవలు ప్రారంభమయ్యాయి. రూ.149 ప్లాన్ నుంచి వీటి సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. విలీనం అనంతరం జియో హాట్‌స్టార్ సేవల వివరాలు, వాటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరల కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మూడు రకాలుగా లభిస్తున్న సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

ఐపీఎల్‌ను ఉచితంగా జియో సినిమాలో చూసిన క్రికెటర్ లవర్స్‌కు ఇది షాకింగ్ న్యూస్. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ కలిసిపోవడంతో ఇకపై సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే తప్ప మ్యాచ్ చూడలేరు. జియోహాట్‌స్టార్‌ సేవలు వినియోగించుకోవాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సింది. 

1. జియో హాట్‌స్టార్‌లో అతి తక్కువ ధర సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్ రూ.149కి ప్రారంభం అవుతుంది. ఇది మొబైల్‌ ప్లాన్‌ (ad-supported plan). దీని వ్యాలిడిటీ 3 నెలలు ఉంటుంది. ఏడాది వ్యాలిడిటీ ప్లాన్‌ ధర రూ.499గా ప్రకటించారు. అయితే ఈ 2 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే ఒక్క మొబైల్‌లో మాత్రమే కంటెంట్‌ చూడగలరు. 

2. మరో 2 సూపర్ ప్లాన్లు (ad-supported plan)ను జియో హాట్‌స్టార్ ప్రకటించింది. వీటి ద్వారా రెండు డివైజ్‌లలో కంటెంట్ చూసే వీలుంటుంది. 3 నెలల వ్యాలిడిటీ ప్లాన్‌ ధర రూ.299 కాగా, ఏడాది వ్యాలిడిటీ ప్లాన్‌ ధర రూ.899గా కంపెనీ నిర్ణయించింది. ఈ ప్లాన్స్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మీరు మొబైల్, డెస్క్ టాప్, సపోర్టెట్ టీవీలోగానీ ఏవైనా రెండు డివైజ్‌లలో కంటెంట్ చూసే వీలుంటుంది.

3. యాడ్స్ లేకుండా కంటెంట్‌ చూడాలనుకుంటే ఈ ప్రీమియం ప్లాన్స్ తీసుకోవాలి. రూ.299తో సబ్‌స్క్రైబ్ చేసుకుంటే యాడ్స్ లేకుండా నెల రోజులు కంటెంట్ చూడవచ్చు. ఈ ప్లాన్‌ను కేవలం వెబ్‌బ్రౌజర్‌ ద్వారా  కొనుగోలు చేసే వీలుంటుంది. రూ.499 ప్లాన్ తీసుకుంటే 3 నెలల వ్యాలిడిటీ ప్లాన్ పొందుతారు. యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే ధర రూ.1499 ప్రీమియం ప్లాన్ తీసుకోవాలి. దాంతో ఏడాది పాటు ఎలాంటి యాడ్స్ లేకుండా కంటెంట్ ఆస్వాదించవచ్చు అని 499. ఈ ప్రీమియం ప్లాన్లతో ఒకేసారి 4 డివైజ్‌లలో కంటెంట్‌ను చూడవచ్చునని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

Also Read: Ambani Family Networth: అంబానీ ఫ్యామిలీ సంపదకు సలాం - రెండో ర్యాంక్‌ కుటుంబం కంటే రెట్టింపు ఆస్తి