Vishwak Sen's Laila Movie Twitter Review In Telugu: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన 'లైలా' చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) కానుకగా ఈ రోజు విడుదల చేశారు. వివాదాలు పక్కన పెడితే సినిమా ఎలా ఉంది? ఆల్రెడీ ప్రీమియర్ షోలు చూసిన నెటిజనులు ఏమంటున్నారు? అనేది చూస్తే...
మా నాన్న చిరంజీవి డై హార్డ్ ఫ్యాన్!
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఆయనను ఎందుకు పిలిచారు అనేదానికి సినిమా ఫస్టాఫ్ కంప్లీట్ కాకముందు ప్రేక్షకులకు సమాధానం లభిస్తుంది. 'మై ఫాదర్ ఈజ్ చిరంజీవి డై హార్ట్ ఫ్యాన్' (మా నాన్న చిరంజీవికి వీరాభిమాని) అని ఓ డైలాగ్ ఉంది. అదొక్కటే కాదు... మెగాస్టార్ సూపర్ హిట్ సినిమాలు అయినటువంటి 'ఖైదీ', 'శుభలేఖ', 'రుస్తుం', 'జగదేకవీరుడు అతిలోక సుందరి'తో పాటు బోలెడు చిరు రిఫరెన్సులు సినిమాలో ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏ సినిమాలోనూ చిరంజీవిని ఈ స్థాయిలో వాడలేదని సినిమా చూసిన జనాలు చెబుతున్నారు.
'లైలా' చేయడానికి గట్స్ కావాలి!
లైలా కోసం విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్ వేశాడు. ఆ క్యారెక్టర్ చేయడానికి గట్స్ కావాలని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. లేడీగా విశ్వక్ సేన్ అదరగొట్టాడని టాక్. సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడట. విశ్వక్ సేన్ నటన వరకు ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమా అంతా విశ్వక్ సేన్ డామినేట్ చేశాడట.
అభిమన్యు సింగ్ నవ్వించాడు...
'గబ్బర్ సింగ్' సహా పలు సినిమాలలో పవర్ ఫుల్ విలన్ రోల్స్ చేశాడు అభిమన్యు సింగ్. అతను ఈ సినిమాలో ప్రేక్షకులను బాగా నవ్విస్తాడని సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. 'లైలా' ఫస్టాఫ్ చూసిన జనాలు ఎక్కువ మంది అతని క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. అభిమన్యు సింగ్ పెళ్లి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు నవ్వించాయట.
'లైలా'ను మర్చిపో విశ్వక్ సేన్...
ప్రశంసలు పక్కన పెడితే... సినిమా మీద బ్యాడ్ టాక్ ఎక్కువ ఉంది. విశ్వక్ సేన్ సహా అతని టీమ్ అంతా లైలా సినిమాను మర్చిపోవచ్చని ఒక నెటిజన్ పేర్కొన్నారు. స్టోరీ రైటింగ్ నుంచి డైరెక్షన్ అండ్ మ్యూజిక్ వరకు ప్రతి ఒక్కరు బెస్ట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారని చెబుతున్నారు. ఆఖరికి నటీనటుల సైతం తమ పాత్రలకు తగ్గట్టు నటించడంలో ఫెయిల్ అయ్యారట. ఫస్టాఫ్ బాలేదంటే సెకండాఫ్ అంతకు మించి అన్నట్టు ఉందట.
'డిజాస్టర్ లైలా' వెనుక వైసీపీ...
'లైలా' సినిమా మీద విడుదలకు ముందు నుంచి భారీ ఎత్తున నెగెటివిటీ నడిచింది. నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యల కారణంగా సినిమాను బాయ్ కాట్ చేయమని వైసీపీ సానుభూతిపరులు పిలుపు ఇచ్చారు. తన సినిమాకు రాజకీయాలకు ముడి పెట్ట వద్దంటూ విశ్వక్ సేన్ కోరినప్పటికీ... విడుదల రోజున వైసీపీ సోషల్ మీడియా కారణంగా డిజాస్టర్ లైలా ట్రెండింగ్ లోకి వచ్చిందని ట్విట్టర్ చూస్తే తెలుస్తోంది. న్యూట్రల్ సోషల్ మీడియా అకౌంట్స్ సైతం 'లైలా'కు నెగిటివ్ రివ్యూలు ఇవ్వడంతో సామాన్య జనాలలో సినిమా మీద ఆసక్తి మరింత తగ్గుతోందని చెప్పాలి.