Telugu TV serials TRP ratings this week - Check out list of top 10: గుడి గంటలు గట్టిగా మోగాయి. టీఆర్పీ రేటింగుల్లో కొన్ని వారాలుగా నెంబర్ వన్ స్థానం కైవసం చేసుకుంటూ వస్తున్న 'కార్తీక దీపం నవ వసంతం' జైత్రయాత్రకు ఎట్టకేలకు 'గుండె నిండా గుడిగంటలు' అడ్డుకట్ట వేసింది. టాప్ ప్లేస్ కైవసం చేసుకుంది. గత కొన్ని రోజులుగా 'గుండె నిండా గుడిగంటలు'కు ఆదరణ బాగుంది. టీఆర్పీ రేటింగుల్లో 'కార్తీక దీపం 2' వెనుక వెనుక నిలబడుతూ డేంజర్ బెల్స్ మోగిస్తూ వస్తోంది. ఈసారి మాత్రం ముందుకొచ్చింది. ఫిబ్రవరి మొదటి వారంలో... అంటే 2025 ఏడాదిలో ఐదో వారం టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే... 'గుండె నిండా గుడిగంటలు' టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. మరి, ఈ వారం టాప్ 10 లిస్టులో ఏయే సీరియళ్లు ఉన్నాయి? అనేది చూస్తే...
నెంబర్ వన్ ప్లేసులో గుండె నిండా గుడిగంటలు...
సెకండ్ ప్లేసులో కార్తీకదీపం... లిస్టులో మూడో సీరియల్ ఏది?
జస్ట్ 0.01% తేడాతో లాస్ట్ వీక్ 'కార్తీక దీపం 2' మొదటి స్థానంలో ఉంది. కానీ, ఈ వారం వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. భారీ మార్జిన్ తీసుకుని నెంబర్ వన్ ప్లేసుకు వచ్చింది 'గుండె నిండా గుడిగంటలు'. స్టార్ మా ఛానల్ వరకు ఈ వారం ఏ సీరియల్ ఏ స్థానంలో ఉందనేది చూస్తే...
'గుండె నిండా గుడిగంటలు'కు ఈ వారం 11.34 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత స్థానంలోని 'కార్తీక దీపం 2' 10.23 టీఆర్పీ అందుకుంది. 'ఇంటింటి రామాయణం' సైతం ఈ వారం మంచి టీఆర్పీ నమోదు చేసింది. ఆ సీరియల్ 10.12 రేటింగ్ అందుకుంది. టీఆర్పీ రేటింగ్స్ పరంగా 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (8.99), 'నువ్వుంటే నా జతగా' (8.48) టీఆర్పీతో తర్వాత స్థానాలు సొంతం చేసుకున్నాయి. స్టార్ మా వరకు మాత్రమే కాదు... ఈ వారం టాప్ టెన్ టీఆర్పీల్లో టాప్ 5 సీరియల్స్ ఇవే.
'స్టార్ మా'లో మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... చిన్ని (7.04), బ్రహ్మముడి (5.89), 'పలుకే బంగారమాయేనా' (5.61), 'నిన్ను కోరి' (4.13), 'గీత ఎల్.ఎల్.బి' (4.44), 'మామగారు' (4.34), టీఆర్పీ రేటింగ్స్ అందుకున్నాయి.
పడమటి సంధ్యారాగం... జీ తెలుగులో మొదటి స్థానం!
గతవారం టీఆర్పీ రేటింగుల్లో రెండో స్థానం అందుకున్న 'పడమటి సంధ్యారాగం' ఈ వారం వచ్చేసరికి మొదటి స్థానంలో వచ్చింది. ఆ సీరియల్ 7.32 టీఆర్పీ రేటింగ్ అందుకుంది. ఈ వారం టాప్ టెన్ సీరియల్స్ లిస్టులో దానిది ఆరో స్థానం కాగా... జీ తెలుగులో మొదటి స్థానం.
Also Read: పల్లవి గౌడ డబుల్ ధమాకా... జీ తెలుగు సీరియల్ 'నిండు నూరేళ్ళ సావాసం'లో ట్విస్ట్ తెలిసిందా?
జీ తెలుగులో మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'చామంతి' (7.03), 'జగధ్దాత్రి' (6.97), 'మేఘ సందేశం' (6.73), 'అమ్మాయి గారు' (6.22), 'నిండు నూరేళ్ల సావాసం' (5.64), 'ప్రేమ ఎంత మధురం' (4.89), 'మా అన్నయ్య' (3.93), 'గుండమ్మ కథ' (3.50), 'ముక్కుపుడక' (3.28), 'ఉమ్మడి కుటుంబం' (2.89) టీఆర్పీ రేటింగ్స్ అందుకున్నాయి.
జెమిని టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటిలా ఒకటికంటే తక్కువ టీఆర్పీతో సరిపెట్టుకున్నాను. కనీసం వన్ రేటింగ్ సాధించిన సీరియల్ ఒకటి కూడా లేదు. ఈటీవీ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే... 'రంగులరాట్నం' (2.08), 'మనసంతా నువ్వే' (2.01) రేటింగ్ సాధించాయి. 'ఝాన్సీ' (1.79), 'శతమానం భవతి' (1.54), 'బొమ్మరిల్లు' (1.51) టీఆర్పీ రేటింగ్స్ సాధించి ఆ ఛానల్ టాప్ 5 లిస్టులో చోటు సొంతం చేసుకున్నాయి.
Also Read: జీ తెలుగు సీరియల్స్... మళ్ళీ సేమ్ టైమింగ్స్‌లో... ఏది ఏ టైంలో వస్తుందో తెలుసుకోండి