Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ కంగారులో పేపర్ తిరగేసి చదువుతుంది. సీత చూసి ప్రశ్నిస్తుంది. ఇక విద్యాదేవి సిగరెట్ వాసన వస్తుందని అంటుంది. మహాలక్ష్మీ సిగరెట్ గమనిస్తుంది. గ్యాస్ లీక్ అవుతుందేమో అని మహాలక్ష్మీ అంటుంది. సీత సిగరెట్ చూస్తుంది. చైర్ మీద గౌతమ్ వదిలేసిన లైటర్ కూడా గుర్తిస్తుంది. 

జనార్థన్: మన ఇంటికి వచ్చి సిగరెట్ తాగింది ఎవరు. ఇంటికి ఎవరు వచ్చారు మహా.మహాలక్ష్మీ: మనం ఇంట్లో లేనప్పుడు సాంబ ఇంట్లోకి వచ్చి తాగాడేమో.సీత: సాంబన్నకి సిగరెట్ తాగే అలవాటు లేదు ఒక వేళ ఉన్నా బయట తాగుతాడు కదా. ఇంట్లో ఎందుకు తాగుతాడు.మహాలక్ష్మీ: ఎవరో ఇంట్లోకి వచ్చి సిగరెట్ తాగి లైటర్ మర్చిపోయి ఉంటాడు. వదిలేయండి.సీత: అలా ఎలా వదిలేస్తాం. ఎవరు పడితే వాళ్లు వచ్చి సిగరెట్ తాగితే ఎలా వదిలేస్తాం.

అర్చన వాళ్లు దొంగ అయింటారని అంటే విద్యాదేవి దొంగ అయింటారని తలా ఓ వైపు వెతుకుదామని అంటుంది. ఇంతలో గౌతమ్ పక్కనే ఉన్న ప్లవర్ వాజ్ పడేస్తాడు. దాంతో పైన ఎవరో ఉన్నారని అనుకుంటారు. దొంగ అయింటాడు వాడి సంగతి తేల్చుతానని సీత ఇంట్లో ఉన్న పెద్ద గన్ తీసి బయల్దేరుతుంది. ఇది నా గన్ తీసిందేంటని మహాలక్ష్మీ మనసులో అనుకుంటుంది. సీతని చూసిన గౌతమ్ పరుగులు పెడతాడు. సీత గన్ కాల్చుతుంది. గౌతమ్ పరుగెత్తడంతో పక్కనే ఉన్న పూలకుండీలకు బులెట్లు తగులుతాయి. గౌతమ్ తప్పించుకొని పారిపోతాడు. దొంగ తప్పించుకొని పారిపోయాడని సీత చెప్పడంతో మహాలక్ష్మీ ఊపిరి పీల్చుకుంటుంది. 

ఇంట్లో ఉన్నావ్ కదా చూడలేదా అని జనార్థన్ అంటే మహాలక్ష్మీ తాను చూడలేదని అంటుంది. పట్టపగలు ఇంత ధైర్యంగా వచ్చాడంటే వాడిని వదిలేదే లేదని సీత అంటుంది. ఇక మహాలక్ష్మీ సీతతో ఇంకోసారి నా గన్ మీద చేయి వేస్తే ఊరుకోనని సీత దగ్గర గన్ తీసుకుంటుంది. ఇక సీత మహాలక్ష్మీకి ఎందుకు కంగారు పడుతున్నారు అని అంటుంది. ఇంట్లో దొంగ ఉన్నా మీరు కంగారు పడలేదు అంటే మీకు ఆ దొంగ గురించి ముందే తెలుసా అని అంటుంది. తెలీదని మహాలక్ష్మీ చెప్పడంతో మొత్తం నేను తెలుసుకుంటానని చెప్పి సీత వెళ్తుంది. మహాలక్ష్మీ చాలా టెన్షన్ పడుతుంది. 

ఇక మహాలక్ష్మీ దగ్గరకు అర్చన వచ్చి మీద చేయి వేయడంతో మహాలక్ష్మీ చాలా కంగారు పడుతుంది. ఆ దొంగ ఎవరో నీకు తెలుసు కదా అంటే నాకు తెలీదని మహాలక్ష్మీ చెప్తుంది. తర్వాత గౌతమ్ మహాలక్ష్మీకి కాల్ చేసి ఎవరు అది నన్ను కాల్చడానికి ప్రయత్నించింది అంటే సీత అంటే అదే అని చెప్తుంది మహాలక్ష్మీ. ఇంట్లో వాళ్ల గురించి నీకు తెలిసింది కదా డాక్టర్ ఇంటికి వెళ్లు ఇక్కడికి రావొద్దు అంటుంది. నీకు ఏం కావాలి అన్నా అక్కడికి పంపిస్తా నువ్వు రాకు అని అంటుంది. అలా కుదరదు అని గౌతమ్ అంటాడు. వారంలో నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లాలి లేదంటే నేనే వచ్చి నిజం చెప్పేస్తా అని అంటాడు. జరిగిందంతా సీత తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రామ్ సీతతో మనం బయటకు వెళ్లి సరదాగా గడుపుదాం అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇది కదా కావాల్సింది.. కావేరిని చిన్నమ్మా అని పిలిచిన కార్తీక్.. ఏకాకైపోయిన శ్రీధర్!