Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కాంచన కావేరి చేతులు పట్టుకొని నువ్వు పసి ప్రాణం నిలబెట్టి నా అహంకారం మీద దెబ్బ కొట్టావ్.. నాకు తోడబుట్టిన దానివి అయిపోయావని కాంచన అంటుంది. ఈ ఒక్క మాట చాలు అక్క అని కావేరి అంటుంది. ఇక శ్రీధర్ దానికి డబ్బు తిరిగి ఇవ్వకూడదనే కార్తీక్ ఇలా వీళ్లని పంపాడని అంటే దీప నా భర్తని ఏమనొద్దని అంటుంది. నా కోడల్ని ఏమనొద్దని కాంచన అంటే అక్కని నా కోడల్నిఏం అనొద్దని కావేరి అంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. శౌర్యని కావేరి పలకరిస్తే శౌర్య కావేరిని కూడా నానమ్మ అంటుంది. ఇక నాన్న నీకు థ్యాంక్స్ చెప్పమన్నాడని కావేరికి థ్యాంక్స్ చెప్తుంది.  


కార్తీక్: మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు దీప. చెప్పాలి అనుకొని ఉంటావ్ కానీ చెప్పలేదు కదా. తర్వాత మనం మాట్లాడుకుందాం. మీరు మాట్లాడటం అయిపోతే మీరు ఇంటికి వెళ్లండి అమ్మ.
కావేరి: కార్తీక్ నాతో ఏదో  మాట్లాడాలి అని వచ్చారు.
కాంచన: పర్లేదు కావేరి నేను నీతో చాలా మాట్లాడాలి అని వచ్చాను కానీ నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకున్నావ్. ఇప్పటి నుంచి నువ్వు మా మనిషివే. కొన్ని సార్లు నిన్ను చాలా బాధ పెట్టాను.
కావేరి: వద్దు అక్క నువ్వు నా ముందు తక్కువ కావొద్దు. నువ్వు నా కూతురిని నీ కూతురు అనుకున్నావ్. నేను నీ మనవరాలిని నా మనవరాలిని అనుకున్నా. నేను డబ్బు ఇస్తే నువ్వు నాకు సౌభాగ్యం ఇచ్చావు. నీ గొప్పతనం ఆకాశమంత ఉంటుంది. నాకు అక్క అనే పిలుపు చాలు.
శౌర్య: నాన్న చిన్న నానమ్మ మన ఇంటికి వస్తుందా.
కాంచన: శౌర్య మనం ఇంటికి వెళ్దామా. దీప కార్తీక్ ఎందుకు వచ్చినట్లు.
దీప: నాకు అదే అనుమానంగా ఉంది వెళ్లి చూసి వస్తానమ్మా.
కార్తీక్: మనం కష్టాల్లో ఉన్న వారే మనకి దేవుడు.
శ్రీధర్: అంటే నేను నీకు దేవుడంటే కదా.
కార్తీక్: పక్కవాళ్ల సాయాన్ని తనది అని చెప్పుకున్నవాడు దరిద్రుడు.
శ్రీధర్: నేను వచ్చింది నీ కోసం కాదు అంటావ్ అంతేనా.
కార్తీక్: నేను వచ్చింది నీ కోసమే మాస్టరూ నువ్వు అన్న ప్రతీ ప్రశ్నకు బదులు ఇవ్వడానికి కానీ అంతకంటే ముందు ఒక పని ఉంది. నేను ఎప్పుడూ మీ కోసం ప్రేమగా మాట్లాడలేదు పలకరించలేదు కానీ మీరు నా కూతురి ప్రాణాలు కాపాడారు దానికి జీవితాంతం రుణ పడి ఉంటాను. పాప ఆపరేషన్‌కి డబ్బు అప్పుగా తీసుకున్నట్లు ఓ పేపర్లు తీసుకొస్తాడు.
కావేరి: నేను అప్పుగా ఇవ్వలేదు శౌర్య నాకు మనవరాలు అంతే. 
దీప: మనసులో కార్తీక్ బాబు ఇందుకు వచ్చారా. 
కావేరి: కార్తీక్ అది నా డబ్బు. నువ్వు తీర్చాల్సిన అవసరం లేదు నాకు ఏం డబ్బు వద్దు కాగితాలు. 
కార్తీక్: నన్ను రుణం తీర్చుకోనివ్వండి. ఈ కాగితాలు మీ దగ్గర ఉండండి.
శ్రీధర్: నువ్వు ఈ అప్పు తీర్చలేవురా. నువ్వు ఎక్కడా బతకలేవు చివరకు నేనే నీకు దిక్కు.
కార్తీక్: క్యాలెండర్‌లో ఈ రోజు డేట్ గుర్తు పెట్టుకో. నేనేంటో చూపిస్తా. ఇప్పటి వరకు నా ఎదుగుదలకు పునాది వేశా ఇప్పుడు గోడలు లేస్తాయి చూడు. 
శ్రీధర్: కార్తీక్ కనీసం నిన్ను పిన్ని అని కూడా పిలవలేదు స్టాంప్ పేపర్లు నీ చేతిలో పెట్టి వెళ్లిపోయాడు కార్తీక్ దృష్టిలో నువ్వు ఎప్పటికీ తల్లిని మోసం చేసిన దానివే. 
కార్తీక్: ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఇందాక నా కూతురు నన్ను ఓ ప్రశ్న అడిగింది చిన్న నానమ్మ మన ఇంటికి వస్తుందా అని నువ్వు మన ఇంటికి ఎప్పుడైనా రావొచ్చు చిన్నమ్మ. నీ కూతురి ఇంటికి వెళ్లినట్లే నీ కొడుకు ఇంటికి కూడా రావొచ్చు. ఉంటా చిన్నమ్మా. దీప చూసి మురిసిపోతుంది.
కావేరి: నన్ను చిన్నమ్మా అన్నాడు. అక్క పెద్ద అమ్మ నేను చిన్న అమ్మ ఈ పిలుపు సరిపోతుందా. కార్తీక్ నన్ను తల్లిని మోసం చేసిన దానిలా కాదు తల్లితో సమానంగా చూస్తున్నాడు ఇప్పటికైనా అర్థం చేసుకోండి.
శ్రీధర్: ఏంటి కార్తీక్ ఇలా షాక్ ఇచ్చాడు వీళ్లంతా ఒక్కటైపోతారా. కార్తీక్ గొప్పోడు అయిపోతాడా.


కార్తీక్ వాళ్లు ఇంటికి వస్తారు. చిన్నమ్మ అని పిలిచావంటా అని కాంచన అడిగితే నువ్వు చెల్లి అనుకున్నావ్ కదా అంటాడు. దానికి అనసూయ సాయం చేసిన ఆమెకు మనమంతా ఒకటే అని చెప్తారు చాలా సంతోషంగా ఉంది బాబు అని అంటుంది. అందరినీ అర్థం చేసుకున్న మీరు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారని దీప అడుగుతుంది. దానికి కార్తీక్ నువ్వేం అయిపోతావ్ అని నేను శౌర్య ఆరోగ్యం విషయం దాచేస్తే చిన్నమ్మ డబ్బు ఇస్తే నేను బాధ పడతా అని నువ్వు దాచావు ఇదే కదా అర్థనారీశ్వరి తత్వం అని అంటాడు. కంట్లో నీళ్లు రాకుండా చేయి ఉంటుంది కానీ కంటిలో నీలు రాకుండా మనసు చూసుకుంటుంది ఇంతకంటే ఏం కావాలి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.



Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: పోస్టర్ చిచ్చు.. జడ్జి పరువు తీసేసిన ఫోన్ కాల్స్.. దేవాకి పురుషోత్తం సలహా!