Nuvvunte Naa Jathaga Serial Today February 12th: "నువ్వుంటే నా జతగా" సీరియల్: ఈ లవ్‌గురు ఇచ్చే మందు మహా ఫేమస్.. లవర్స్ క్యూ.. పల్నాటి నాగమ్మతో దేవా యుద్ధం..!
Nuvvunte Naa Jathaga Today Episode దేవాని తన వశం చేసుకోవడానికి భాను లవ్ గురు దగ్గరకు వెళ్లి వశీకరణ మందు తీసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మేడ మీద పడుకొని ఉంటాడు. మిధున ఆరు బయట ఉంటుంది. ఇక సత్యమూర్తి పది లక్షల కోసం బాధ పడుతూ అంత డబ్బు ఎలా కట్టాలా అనుకుంటారు. శారద కాఫీ ఇస్తే పిల్లలు నిద్ర లేచారా అని అడుగుతాడు. లేదని ఆవిడ చెప్తుంది. సూర్య కాంతం పడుకున్న భర్తని చూసి మురిసిపోతుంది. అత్తతో కాఫీ పెట్టించుకొని తాగాలని బయటకు వస్తుంది. సత్యమూర్తి కాంతాన్ని పిలిచి మీ ఆయన నిద్ర లేచాడా అంటే లేదని కాంతం చెప్తుంది.
పెద్ద కోడలిని అడిగితే ఆనంద్ జాబ్ కోసం ప్రయత్నాలు చేసి చేసి అలసి పోయి పడుకున్నాడని చెప్తుంది. పది అయినా ఎవరూ లేవడం లేదు క్రమశిక్షణ తప్పిపోయిందని మీరు ఇలా భర్తల్ని వెనకేసుకురావడం వల్లే వాళ్లకి పద్ధతి లేకుండా పోయిందని అంటారు. ఆనంద్, శ్రీరంగం ఇద్దరిని లేపుతాడు. టైం ఎంత అని అడిగితే శ్రీరంగం నీ చేతికి వాచ్ ఉంది కదా అంటాడు. దాంతో సత్యమూర్తి కొడుకుని లాగిపెట్టి కొడతాడు. పెళ్లి అయింది.. బాధ్యత రాలేదు.. నా డబ్బుతోనే బతుకుతున్నారు కదా అంటాడు.
సత్యమూర్తి: ఒక వైపు పది లక్షలు కట్టాలని నేను టెన్షన్ పడుతున్నా మీరు కనీసం ఏం పట్టించుకోవడం. అసలు మీకు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందిరా.
శ్రీరంగం: మమల్ని అంటున్నారు కానీ మేడ మీద ఇంకొకడు ఉన్నాడు వాడు 12 అయినా లేవడు.
ఆనంద్: ఏదో ఒకసారి మేం పడుకుంటే ఇంతలా తిడుతున్నారు. వాడు రోజూ ఇదే టైంకి లేస్తాడు.
సత్యమూర్తి: ఓరేయ్ వాడిని ఎప్పుడో నేను కొడుకుగా చూడటం మానేశాను. మిమల్ని కూడా వదిలేయమంటారా. చెప్పండి మిమల్ని ఇద్దర్ని వదిలేయమంటారు. మనసులుగా మీ ఇద్దరికీ క్రమశిక్షణ లేదు. బతుకు మీద బాధ్యత లేదు. నేను ఏం పాపం చేస్తే ఇలాంటి కొడుకులు పుట్టారురా. వెళ్లండిరా మీ ముఖాలు కూడా నాకు చూపించకండి. వెళ్లండి.
దేవా మీద మిధున నీరు విసిరేస్తుంది. మొన్న ఓవరాక్షన్ హీరోయిన్ నీరు విసిరింది ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కదా అనుకుంటాడు. మొత్తం చూస్తాడు. మిధునని చూసి ఈ పల్నాటి నాగమ్మే ఈ నీటి యుద్ధం వెనక ఉంటుందని అనుకుంటాడు. మిధునని ఏయ్ నువ్వే కదా నీరు విసిరావ్ అని అడుగుతాడు. పది వరకు పడుకుంటే నీరు కాకపోతే పన్నీరు విసురాతారా అంటుంది మిధున. నీరు విసరడానికి నువ్వు ఎవరు అంటే మిధున తాళి చూపిస్తుంది. దేవా కిందకి వచ్చి మిధునని తిడితే మామయ్య గారు అని పిలుస్తుంది. దాంతో దేవా నాన్నని పిలవొద్దని బతిమాలుతాడు. ఇక వేడి నీరు పెడతానని అంటుంది. అవసరం లేదని దేవా అంటే తాళి చూపిస్తుంది. తాళి తోనే చంపేస్తావే అని అంటాడు. వేడి నీలు దేవా తీసుకెళ్తుంటే కాళ్ల మీద పడతాయని మిధున అంటే దేవా కాళ్ల మీద పడిపోతాయి. ఏం నోరే నీది అని దేవా అంటాడు.
ఇక భాను దేవాని వశీకరణ చేసుకోవడానికి సూర్యకాంతం చెప్పి అడ్రస్‌కి మందు కోసం మోడ్రన్ లవ్ లవ్వానంద స్వామి ఆశ్రమానికి వెళ్తుంది. ఓ అమ్మాయి బ్రేక్ చెప్పిన తర్వాత తన లవర్‌కి తాయత్తు కట్టగానే అతను తిరిగి తన దగ్గరకు వచ్చేశాడని ఆ అమ్మాయి మురిసిపోతుంది. అది చూసి భాను ఈ ముందు ఎలా అయినా పని చేస్తుందని అనుకుంటుంది. తన రాజా తననే పెళ్లి చేసుకోవాలని లవ్ గురూకి తన ప్రేమ గురించి చెప్తుంది. లవ్ గురి ఓ మందు భానుకి ఇచ్చి ఇది నువ్వు ప్రేమించిన వాడి తల మీద పెట్టు ఇది పెట్టగానే తన వెంట్రుకలకు తలగానే నీ వెనక హచ్ కుక్కలా పడతాడని నీ వశం అయిపోతాడని చెప్తుంది.
దేవా పురుషోత్తాన్ని కలిసి మిధున టార్చర్ అని చిరాకుగా ఉందని చెప్పుకుంటాడు. నేను ఆ విషయం చూసుకుంటానని పురుషోత్తం అంటాడు. ఇక భాను కాటుక లాంటి వశీకరణ మందు తీసుకొచ్చి దేవాని తన వశం చేసుకుంటానని అనుకుంటుంది. దేవా ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి నా రాజా ఎక్కడని అడుగుతుంది. పురుషోత్తం దగ్గరకు వెళ్లాడని చెప్తారు. ఇక ఫ్రెండ్స్‌ని నేను బాగున్నానా ఆ మిధున బాగుందా అంటే అందరూ మిధున వదినే బాగుందని అంటారు. భాను తిడితే నువ్వు బాగున్నావని అంటారు. ఇక దేవా రావడంతో భాను వశీకరణ మందు రాయడానికి ప్రయత్నిస్తుంది. దేవా ఏంటి అని అడిగితే ఏం లేదు అంటుంది. ఎన్ని సార్లు ప్రయత్నించినా దేవాకి మందు కలర్ పెట్టలేకపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: కోడలికి విషం ఇస్తే కొడుకు నొప్పులు పడుతున్నాడేంటి? విజయాంబికకు ఇది షాకే!