టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ వివాదం గత కొంతకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ "నన్ను తొక్కాలన్నా, లేపాలన్నా వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది, జాతి పేరు చెప్పుకుని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేనేమన్నా కాయనా, పండునా?" అంటూ చేసిన సంచలన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదంతా 'జగన్నాథ్' అనే మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో జరిగింది.
టీజర్ లాంచ్ ఈవెంట్లో మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
'జగన్నాథ్' అనే మూవీతో భరత్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ టీజర్ గురువారం రిలీజ్ చేశారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో 'జగన్నాథ్' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. దీనికి స్పెషల్ గెస్ట్ గా మంచు మనోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నా జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా... ఎంతమంది నన్ను తొక్కాలని చూసినా, నాపై బురద చల్లాలని ఆలోచించినా... ఆ నాలుగు గోడల మధ్యకు నన్ను రానివ్వకుండా చేసినా... నన్ను ఏం చేసినా సరే, జనాలు గుండెల్లో నుంచి మాత్రం తీయలేరు. మీరే నా దేవుళ్ళు, కుటుంబం... నాకు అన్నీ మీరే... చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయనో లేదా పండునో కాదు... మీ మనోజ్ ను. నన్ను తొక్కుదామని చూస్తారా? నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కలన్నా, లేపాలి అన్నా అది కేవలం అభిమానుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది... అంతేతప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరి వల్ల ఆ పని జరగదు" అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
"ఓ మంచి పని కోసం నిలబడ్డప్పుడు న్యాయం జరిగే వరకూ దాన్ని వదిలి పెట్టను. అది నావాళ్ళైనా, బయట వాళ్లైనా సరే.... న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. నేను విద్యార్థుల కోసమే నిలబడ్డాను. నా ప్రాణం ఉన్నంత వరకు ఇలాగే నిలబడతాను. ఈరోజే కాదు ఎప్పటికీ ఎవ్వరూ ఆపలేరు నన్ను" అంటూ మంచు మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
Also Read: లైలా మూవీ రివ్యూ: లేడీ గెటప్ వేస్తే చాలా? థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమాను చూడగలమా?
చిన్న సినిమా, పెద్ద సినిమా కాదు.. బాగుందా, లేదా అంతే !
సినిమా గురించి మాట్లాడుతూ "ఈరోజుల్లో సినిమాలు రూపొందించడం అన్నది అంత తేలికైన పని కాదు. కోటితో తీసినంత మాత్రాన చిన్న సినిమా కాదు. వేల కోట్లు పెట్టి తీసినంత మాత్రాన పెద్ద సినిమా కాదు. సినిమా అంటే సినిమా మాత్రమే... బాగుందా లేదా అనేదే ముఖ్యం. సినిమా చాలా గొప్పది, కాబట్టే దీన్ని తల్లితో పోలుస్తూ ఉంటాను. ఈ మూవీ టీం హైదరాబాద్ లోనే ఈవెంట్ పెట్టాలని అనుకున్నారు. కానీ మన ఊరు నుంచి వచ్చారు కదా ఎక్కడో ఎందుకు? అక్కడే పెట్టండి అని నేనే చెప్పాను. ఎదుటివారు కష్టంలో ఉన్నారంటే నేను మాత్రమే కాదు, రాయలసీమలో ఎవరైనా ముందుకు వస్తారు' అంటూ మంచు మనోజ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.