RRR Review | సినిమా విశ్లేషణలు.. వ్యక్తిని, వ్యక్తిని బట్టి మారిపోతాయి. ఒకరికి నచ్చిన అంశం మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి కనిపించే లోపాలు మరొకరికి కనిపించకపోవచ్చు. హీరోపై అభిమానం ఉన్నవారికి అదొక అద్భుతం.. కానీ, సినీ విశ్లేషకులు అది ఒక ‘ఆర్ట్’. సినిమాలోని 24 ఫ్రేమ్స్ పరిశీలించిన తర్వాత రివ్యూ ఇవ్వాల్సి ఉంటుంది. అది భారీ చిత్రమైనా, గల్లీ చిత్రమైనా.. తప్పొప్పులు, లోపాలు, ప్లస్-మైనస్ పాయింట్లు బేరీజు వేసుకుని.. ప్రేక్షకులు ఆ సినిమా చూడవచ్చా లేదా అనేది చెప్పాలి. అలాగే, తెలుగు చిత్రాలు.. హిందీలోకి డబ్ అయినా, పాన్ ఇండియా మూవీకి రిలీజైనా రేటింగ్స్ మారిపోతుంటాయి. ఒక్కో చోట ఒక్కో విధమైన రివ్యూలు వస్తుంటాయి. ప్రస్తుతం RRR మూవీకి సంబంధించి కూడా అలాంటి రివ్యూలే వస్తున్నాయి. తెలుగులో కొన్ని మీడియా సంస్థలు 2.5 నుంచి 3.5 వరకు రేటింగ్స్ ఇస్తున్నాయి. మరి, నేషనల్ మీడియాకు రాజమౌళి చిత్రం నచ్చిందా. ఇన్నాళ్లు ఆయన పడిన శ్రమకు గుర్తింపు లభించిందా? ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నటనపై తెలుగేతర ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉంది? అక్కడి ప్రేక్షకులకు RRR నచ్చుతుందా? రాజమౌళి మ్యాజిక్‌కు ఫిదా అయ్యారా?
RRR చిత్రానికి తరణ్ ఆదర్శ్ మంత్రముగ్దులయ్యారు. చిత్రం రివ్యూను ఒకే ఒక మాటలో చెప్పేశారు. TERRRIFICగా ఉందంటూ కితాబిచ్చారు. చిత్రానికి 4/5 రేటింగ్ ఇచ్చారు. రాజమౌలి మళ్లీ తన సత్తా చాటారని, ఎమోషన్స్ - దేశభక్తితో కూడిన చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారని ఆయన వెల్లడించారు.
సినీ విమర్శకుడు KRK ఏకంగా.. ఈ చిత్రాన్ని ఏకిపారేశాడు. మరి, అతడు సినిమా చూశాడో లేదో తెలీదుగానీ.. ఆయనకు దక్షిణాది నుంచి వచ్చే పాన్ ఇండియా చిత్రాలపై ఉండే అలెర్జీని తన రేటింగ్ ద్వారా తెలియజేశాడు. RRR మూవీకి 0/5 రేటింగ్ ఇచ్చాడు. దీన్ని చెత్త చిత్రంగా అభివర్ణించమే కాకుండా.. ఆర్జీవి దర్శకత్వం వహించిన ‘ఆగ్’ చిత్రంతో పోల్చాడు. ఈ చిత్రం తన బ్రెయిన్ సెల్స్‌ను చంపేసిందని, బతికుండగానే చంపేసిందని తెలిపాడు. ‘‘ఇది మిస్టేక్ కాదు, పెద్ద క్రైమ్. రూ.600 బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తీసిన రాజమౌళిని కనీసం ఆరు నెలలు జైల్లో పెట్టాలి’’ అని పేర్కొన్నాడు. అయితే, ఇతడు ఇలా రివ్యూ ఇచ్చాడంటే.. తప్పకుండా RRR పాన్ ఇండియా ప్రేక్షకులకు నచ్చేస్తుంది. గతంలో ‘బాహుబలి’ సీరిస్‌పై కూడా KRK ఇలాగే విషం కక్కాడు.
ఇక నేషనల్ మీడియా సంస్థల విషయానికి వస్తే.. RRR చిత్రంతో రాజమౌళి పవర్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ ఇచ్చారని ఓ ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక తమ రివ్యూలో పేర్కొంది. విమర్శకులు రేటింగ్‌ను 3.5గా వెల్లడించింది. అయితే, కొన్ని సీన్లు మరీ సాగదీసినట్లుగా ఉన్నాయని తెలిపింది. ఇదొక మంచి యాక్షన్ ప్యాక్డ్ డ్రామా అని రివ్యూలో పేర్కొంది. మరో ఇంగ్లీష్ వెబ్‌సైట్ రివ్యూ ప్రకారం.. RRRతో రామ్ చరణ్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేశాడని తెలిపింది. ఈ చిత్రానికి 3.5/5 రేటింగ్ ఇచ్చింది. ABP Nadu (తమిళనాడు) రివ్యూ ప్రకారం.. ‘‘ప్రేక్షకులు అంగీకరించే విధంగా సన్నివేశాలను సెట్ చేయడం, కథలోని భావోద్వేగాలతో ప్రేక్షకులను కనెక్ట్ చేయడం, పాత్రలతోనే కాకుండా వాటి చుట్టుపక్కల ఉండే లక్షణాలతో క్షణిక విషయాలను కూడా తీర్చిదిద్దడం వంటి అంశాలపై రాజమౌళి మరోసారి తనదైన ముద్ర వేశాడు. కానీ, బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. రామ్ చరణ్‌కు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించింది’’ అని రివ్యూలో పేర్కొన్నారు. ఈ చిత్రానికి 3.5/5 రేటింగ్ ఇచ్చారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్' రివ్యూ: నందమూరి - కొణిదెల అభిమానులకు పండగే!
మరో ఇంగ్లీష్ వెబ్‌సైట్.. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు తమ కెరీర్ బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చినట్లు తెలిపింది. RRRను అద్భుతమైన చిత్రంగా వర్ణించింది. మూడున్నరేళ్లు శ్రమించిన రాజమౌళి.. తెరపై మ్యాజిక్ చేశాడు. ఇది ‘వార్ డ్రామా’ చిత్రాల్లో అత్యంత భిన్నమైనదని పేర్కొంది. కొన్ని సీన్లు రోమాలు నిక్కబొడుచుకొనేలా ఉన్నాయని, ఎమోషనల్ సీన్స్ గుండెను హత్తుకొనేలా ఉన్నాయని తెలిపింది. ఎన్టీఆర్ పాత్రతో పోల్చితే రామ్ చరణ్ పాత్రకు కాస్త హైప్ ఉన్నట్లు రివ్యూలో తెలిపారు. చరణ్ పాత్ర రోలర్‌కోస్టర్ రైడ్‌లా సాగుతుందని, ఎన్టీఆర్ కళ్లతోనే ఎన్నో భావోద్వేగాలు ప్రదర్శించారని తెలిపింది. RRR నూరు శాతం పర్ఫెక్ట్ సినిమా కాదని, సెకండ్ ఆఫ్‌లో కొన్ని స్టంట్ సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవాని తెలిపింది. ఎమోషనల్ కనెక్షన్ కూడా మిస్సయ్యిందని తెలిపింది. చిత్రాన్ని కాస్త ట్రిమ్ చేసి ఉంటే.. ఉత్కంఠభరితంగా ఉండేదనే అభిప్రాయాన్ని రివ్యూలో పేర్కొంది. ఈ చిత్రానికి 3.5/5 రేటింగ్ ఇచ్చింది.
Also Read: ‘RRR’ ట్విట్టర్ రివ్యూ - ఇదేంటీ, టాక్ ఇలా ఉంది!