RRR Twitter Review | జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కీలక పాత్రల్లో నటించిన ‘RRR’ చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. గురువారం అర్ధరాత్రి నుంచే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. అమెరికాలోని పలు థియేటర్లలో ఇండియా కంటే ముందుగానే RRR విడుదలైపోయింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు RRR సినిమాపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. కొందరు చిత్రం అదిరిపోయింది, బ్లాక్ బాస్టర్ అని అంటుంటే.. కొందరు మాత్రం ఆశించినంత స్థాయిలో లేదని అంటున్నారు. ఎక్కువ మంది ఇంటర్వెల్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయని అంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఎంట్రీ సీన్లు గురించి మాటల్లో చెప్పలేమని అంటున్నారు. ముఖ్యంగా ‘నాటు నాటు‘ సాంగ్‌కు ఎవరూ కూర్చిలో కూర్చోలేరట. ఆ పాట అయ్యేవరకు గెంతులేయడం గ్యారంటీ అంటున్నారు. ఇది భారతీయ చిత్రాల్లో అత్యుత్తమ చిత్రంగా నిలచిపోతుందని పలువురు అంటున్నారు.
కానీ, కొందరు ‘బాహుబలి’ చిత్రంతో ‘RRR’ను పోల్చుతూ నెగటివ్ పబ్లిసిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి రెండూ వేర్వేరు చిత్రాలని, వాటిని పోల్చడం తగదని సినీ ప్రేమికులు అంటున్నారు. ఈ రివ్యూలన్నీ పూర్తిగా ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇతర హీరోల అభిమానులు ఈ చిత్రంపై నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. నెగటివ్ రివ్యూలు చూసి.. ‘‘ఇదేంటీ టాక్ ఇలా ఉంది?’’ అని అభిమానులు వాపోతున్నారు. అయితే, అమెరికా నుంచి వచ్చిన కొన్ని రివ్యూల ప్రకారం.. ‘బొమ్మ బ్లాక్ బాస్టర్’ అని తెలుస్తోంది. కాబట్టి.. అభిమానులు హాయిగా గుండెలపై చేయి వేసుకుని నిద్రపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల ముందు గురువారం రాత్రి నుంచే సందడి మొదలైంది. అభిమానుల హంగామా మామూలుగా లేదు. ఇప్పుడంతా ఈ సినిమా ఎలా ఉందనే టాక్ మీదే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో చాలామంది రివ్యూల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా చూస్తున్నవారిని.. సినిమా గురించి ఆరా తీస్తున్నారు. మరి, మీకు కూడా RRR ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా? అయితే, ట్విట్టర్‌లో ట్రెండవ్వుతున్న కొన్ని రివ్యూలను మీకు అందిస్తున్నాం. తప్పకుండా చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు.