అంచనాలకు తగ్గట్టుగా 'ఆర్ఆర్ఆర్' సినిమా వసూళ్లు సాధిస్తోంది. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన... దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిభ... వెరసి థియేటర్లకు భారీ ఎత్తున ప్రేక్షకులు రావడానికి కారణం అవుతోంది. తొలి రోజు 230 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ సినిమా, ఆ తర్వాత రెండు రోజుల్లో రూ. 270 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మీద మొదటి మూడు రోజుల్లో రూ. 500 కోట్లు కలెక్ట్ చేసింది.


హిందీలో 'ఆర్ఆర్ఆర్'కు మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం. ఉత్తరాదిన హిందీ, తెలుగు, తమిళ్ వెర్షన్స్ విడుదల అయ్యాయి. నార్త్ ఇండియాలో హిందీ వెర్షన్ మొదటి రోజు రూ. 20 కోట్లు వసూలు చేస్తే... రెండో రోజు (శనివారం) రూ. 23.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఆదివారం అయితే రూ. 31.50 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మీద మొదటి మూడు రోజుల్లో హిందీ వెర్షన్ వసూళ్లు రూ. 74.50 కోట్లు కలెక్ట్ చేసింది. కరోనా తర్వాత హిందీలో సినిమా విడుదలైన తర్వాత మొదటి ఆదివారం ఎక్కువ వసూలు చేసిన సినిమాగా 'ఆర్ఆర్ఆర్' రికార్డు క్రియేట్ చేసింది.


తెలుగు రాష్ట్రాలకు వస్తే... నైజాంలో 'ఆర్ఆర్ఆర్'కు మూడు రోజుల్లో రూ. 53.45 కోట్లు, సీడెడ్ (రాయలసీమ)లో రూ. 26 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 8.67 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మిగతా జిల్లాలు తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ 'ఆర్ఆర్ఆర్' భారీ వసూళ్లు సాధిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ వసూళ్లు కూడా బావున్నాయి.


Also Read: ఇండియన్ సినిమాల్లో నంబర్ వన్, ప్రపంచవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' ఫ‌స్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?


అమెరికాలో ఫస్ట్ వీకెండ్ 9.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిందట. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, దుబాయ్, యూకే తదితర దేశాల్లో వసూళ్లు చూస్తే... ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 'ఆర్ఆర్ఆర్' ఓవర్సీస్ కలెక్షన్స్ ఈజీగా వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోమవారం నుంచి హైదరాబాద్ ఏరియాలో టికెట్ రేట్స్ తగ్గాయి. అందువల్ల, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


Also Read: ప్రభాస్ 'రాధే శ్యామ్', తాప్సి 'మిషన్ ఇంపాజిబుల్', హిందీలో రకుల్ 'అట్టాక్' - ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజులు