RRR Movie First Day Collections Worldwide: 'ఆర్ఆర్ఆర్' సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని సినిమా విడుదలైన మరుసటి రోజు ఉదయం నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారు. సినిమాకు రికార్డు ఓపెనింగ్స్ వస్తాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే... ఎంత? ఎన్ని కోట్లు అనేది తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపించారు.


Rajamouli creates history: బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చెప్పినదాని ప్రకారం 'ఆర్ఆర్ఆర్' సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 223 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇండియన్ సినిమాలో నంబర్ వన్ ఓపెనర్ అని ఆయన పేర్కొన్నారు. రాజమౌళి తనతో తాను పోటీ పడుతున్నారని, 'బాహుబలి 2' రికార్డులను ఆ తర్వాత సినిమాతో బీట్ చేశారని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.'ఆర్ఆర్ఆర్' సినిమా పీఆర్వోలు కూడా కలెక్షన్స్ పోస్టర్ ట్వీట్ చేశారు.


గురువారం ప్రీమియర్ షో కలెక్షన్స్, శుక్రవారం కలెక్షన్స్ కలిపితే అమెరికాలో సినిమా రూ. 42 కోట్లు కలెక్ట్ చేసిందట. అమెరికా మినహా మిగతా ఓవర్సీస్ మార్కెట్ చూసుకుంటే... రూ.25 కోట్లు వచ్చిందట. ఇండియాలో రూ. 156 కోట్లు వచ్చిందట. అయితే... తరణ్ ఆదర్శ్ చెప్పిన లెక్క ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో 'ఆర్ఆర్ఆర్'కు 75 కోట్లు వచ్చాయి. కానీ, ఆయన లెక్క కంటే రెండు కోట్లు తక్కువ వచ్చినట్టు ఇండస్ట్రీ టాక్.







Also Read: 'బాహుబలి 2'ను బీట్ చేసిన 'ఆర్ఆర్ఆర్', తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే?

RRR movie smashes day one record collections, crossing Baahubali 2: 'ఆర్ఆర్ఆర్' పీఆర్వో టీమ్‌లో వ్యక్తులు మినహా హీరోలు, దర్శకులు, నిర్మాత ఎవరూ కలెక్షన్స్ గురించి చెప్పడం లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదు. ఆఖరికి సినిమా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కూడా కలెక్షన్స్ ట్వీట్ వేయలేదు. రాజమౌళికి కలెక్షన్స్ చెప్పడం ఇష్టం లేదన్న సంగతి తెలిసిందే.





Also Read: విదేశాల్లో 'ఆర్ఆర్ఆర్' వసూళ్ళ దండయాత్ర! ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతంటే?