దండయాత్ర... ఇది 'ఆర్ఆర్ఆర్' వసూళ్ల దండయాత్ర! ముఖ్యంగా విదేశాల్లో! ఆ దేశం, ఈ దేశం అని లేదు. ప్రతి దేశంలోనూ సినిమా సత్తా చాటుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు, రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షక లోకం ఫిదా అంటోంది. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తూ... దూసుకు వెళుతోంది. ముఖ్యంగా అమెరికా, కెనడాలో 'ఆర్ఆర్ఆర్' భారీ వసూళ్లు సాధించింది. విదేశాల్లో ఈ సినిమా తొలి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే...


అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' సినిమా ఫైవ్ మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ (గురువారం ప్రీమియర్ షోలు ప్లస్ శుక్రవారం కలెక్షన్స్ కలిపి) చేసింది. ఇంకా కొన్ని లొకేషన్స్ అప్ డేట్ చేయాల్సి ఉంది. ఫైవ్ మిలియన్ డాలర్స్ అంటే... భారతీయ కరెన్సీలో సుమారు 38.14 కోట్ల రూపాయలు అన్నమాట.


Also Read: రామ్ చరణ్‌ను చూసి గర్వపడుతున్నా, మా బావ ఎన్టీఆర్ పవర్ హౌస్! - 'ఆర్ఆర్ఆర్'కు బన్నీ రివ్యూ


ఆస్ట్రేలియాలో కూడా సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. అక్కడ సుమారు రూ. 4.03 కోట్లు కలెక్ట్ చేసింది. హాలీవుడ్ సినిమా 'ది బాట్ మ్యాన్' కంటే 'ఆర్ఆర్ఆర్'కు ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం. న్యూజీలాండ్‌లో రూ. 37.07 లక్షలు వచ్చాయి. యూకేలో రూ. 2.40 కోట్లు వచ్చాయి. మొత్తం మీద విదేశాల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమా తొలి రోజు రూ. 67 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసిందట‌. రెండో రోజు కూడా 'ఆర్ఆర్ఆర్'కు బుకింగ్స్ బావున్నాయి. సో... వీకెండ్ వచ్చేసరికి భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. 


Also Read: సమంత దూకుడుకు సాటెవ్వరు? విడాకుల తర్వాత బ్రాండ్ వేల్యూ పెరిగిందా?