Just In





Allu Arjun Review - RRR : రామ్ చరణ్‌ను చూసి గర్వపడుతున్నా, మా బావ ఎన్టీఆర్ పవర్ హౌస్! - 'ఆర్ఆర్ఆర్'కు బన్నీ రివ్యూ
Allu Arjun Congratulates NTR, Ram Charan, SS Rajamouli and RRR Team: 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన అల్లు అర్జున్, చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ... ట్వీట్స్ చేశారు.

'RRR' సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన శుక్రవారమే సినిమా చూశారు. భార్య అల్లు స్నేహారెడ్డి, పిల్లలతో కలిసి ఏఎంబీ మాల్‌కు వెళ్లారు. శనివారం 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ... సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు.
"ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సినిమా అద్భుతంగా ఉంది. వెండితెరపై ఇటువంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన, ఊహించిన రాజమౌళి గారు అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన మన అందరికీ గర్వకారణం. నా బ్రదర్ రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తనను చూసి ఎంతో గర్వపడుతున్నాను. మా బావ తారక్ (ఎన్టీఆర్) అద్భుతంగా నటించాడు. ఎన్టీఆర్ ఒక పవర్ హౌస్" అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
Also Read: సమంత దూకుడుకు సాటెవ్వరు? విడాకుల తర్వాత బ్రాండ్ వేల్యూ పెరిగిందా?
అజయ్ దేవగన్, ఆలియా భట్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, నిర్మాత డీవీవీ దానయ్య, సినిమాటోగ్రఫర్ కె.కె. సెంథిల్ కుమార్... సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరిని పేరు పేరునా ప్రస్తావిస్తూ... అందరికీ అల్లు అర్జున్ కంగ్రాచ్యులేషన్స్ తెలిపారు.
Also Read: మీకు నచ్చే, మీరు మెచ్చే మాస్‌తో వస్తున్నా - నితిన్! గుంటూరు కలెక్టర్ సాబ్‌గా వచ్చేశాడు