స్టార్ హీరోయిన్ సమంత బ్రాండ్ వేల్యూ పెరుగుతోంది. బ్యాక్ టు బ్యాక్... లేటెస్టుగా ఆమె రెండు యాడ్స్ చేశారు. కొన్ని గంటల వ్యవధిలో సోషల్ మీడియా ఖాతాల్లో తాను చేసిన కొత్త యాడ్స్ పోస్ట్ చేశారు. సమంత ఈ రోజు కొత్తగా యాడ్స్ చేయడం లేదు. అందులో ఒకటి నేషనల్ యాడ్ కావడం గమనించదగ్గ అంశం. గతంలో కూడా చేశారు. అయితే ఇప్పుడు... సినిమాల పరంగా, యాడ్స్ చేసే విషయంలోనూ సమంత జోరు పెంచినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
విడాకుల తర్వాత సమంత బ్రాండ్ వేల్యూ పెరిగిందనేది కొందరు విశ్లేషకులు చెప్పే మాట. విడాకులు తీసుకోవడమే అందుకు కారణం అని చెప్పలేం. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' తర్వాత హిందీలో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం... మరో హిందీ వెబ్ సిరీస్ (హీరో వరుణ్ ధావన్ తో) చేయడానికి అంగీకరించడం... ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాలను హిందీలోనూ విడుదల చేసేలా ప్లాన్ చేయడంతో బ్రాండ్ వేల్యూ పెరిగింది. సమంత సైతం తన దగ్గరకు వస్తున్న బ్రాండ్స్ ను వద్దనకుండా చేస్తున్నారట. అయితే... కొన్ని వివాదాస్పద బ్రాండ్ ప్రమోషన్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.
ఆల్రెడీ 'యశోద' సినిమా షూటింగ్ చేస్తున్న సమంత... 'శాకుంతలం' కంప్లీట్ చేశారు. ఎస్.ఆర్. శేఖర్, ఎస్.ఆర్. ప్రభు నిర్మాణంలో మరో సినిమా చేయడానికి అంగీకరించారు. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయనున్నారు. ఇవన్నీ పాన్ ఇండియా రిలీజులే. ఏడాది తర్వాత సమంత బ్రాండ్ వేల్యూ మరింత పెరగవచ్చని ఒక అంచనా. విడాకుల తర్వాత సమంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆమెకు కలిసి వస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం... విడాకుల తర్వాత తన దగ్గరకు వస్తున్న అవకాశాలను సమంత వృథా చేసుకోవడం లేదు. రెండు చేతులతో దగ్గరకు తీసుకుంటున్నారు.
Also Read: మలయాళంలో బ్లాక్‌బస్టర్, తెలుగులో రీమేక్ చేస్తున్న కరణ్ జోహార్