మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'హృదయం'. రూ. 6 కోట్లతో తీస్తే... సుమారు రూ. 55 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దర్శనా రాజేంద్రన్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తెలుగునాట కూడా మంచి స్పందన లభించింది. హైదరాబాద్‌లో కొన్ని థియేటర్లలో స‌బ్ టైటిల్స్‌తో మలయాళంలో సినిమా విడుదలైంది. మలయాళీలతో పాటు తెలుగు ప్రేక్షకులు కొంత మంది సినిమా చూశారు. ఇప్పుడీ 'హృదయం' గురించి ప్రస్తావన ఎందుకంటే... త్వరలో తెలుగులో రీమేక్ కానుందీ సినిమా. తెలుగులోనే కాదు, హిందీ, తమిళంలోనూ రీమేక్ కానుంది.


'హృదయం' తెలుగు, తమిళ, హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ దక్కించుకున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థతో కలిసి ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై సినిమాను తెరకెక్కించనున్నారు. హీరో హీరోయిన్లు, దర్శకుడిని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. త్వరలో ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.


Also Read: ఏం కెమిస్ట్రీ బ్రో - ‘నాటు నాటు’ స్టెప్పులు, థియేటర్ అదిరేట్టు! ‘భీమ్’ ఏడిపించేస్తాడు


తెలుగు సినిమాపై కరణ్ జోహార్ కాన్సంట్రేట్ చేస్తున్నట్టు ఉన్నారు. 'బాహుబలి'ని ఆయన హిందీలో విడుదల చేశారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోహా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'లైగర్' సినిమా నిర్మాతల్లో ఆయన ఒకరు. ఇంకా కొన్ని తెలుగు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయట.


Also Read: రాజమౌళిని జైల్లో పెట్టాలి, 'RRR' తలా తోకా లేని చిత్రం - ఇతడు రివ్యూ ఇస్తే సినిమా హిట్టే