రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కట్టారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను మొదటి రోజు చూడడానికి ఆసక్తి కనబరిచారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కుటుంబాలతో 'ఆర్ఆర్ఆర్' సినిమా చూశారు. 


ఇక ఈ సినిమా చూసిన వారంతా ట్విట్టర్ వేదికగా సినిమాను తెగ పొగిడేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దర్శకులు, హీరోలు సినిమాని ప్రశంసిస్తూ పోస్ట్ లు పెట్టారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా 'ఆర్ఆర్ఆర్' సినిమాకి రివ్యూ ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్' అనేది మాస్టర్ స్టోరీ టెల్లర్(రాజమౌళి) మాస్టర్ పీస్ అని అన్నారు చిరు. రాజమౌళి విజన్ అద్భుతమని చెప్పిన మెగాస్టార్ 'ఆర్ఆర్ఆర్' టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు. 






ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. నార్త్ ఆడియన్స్ కి ఈ సినిమా విపరీతంగా నచ్చింది. ఎన్నడూ లేని విధంగా నార్త్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కటౌట్ లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. దీన్ని బట్టి 'ఆర్ఆర్ఆర్' సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపు ఐదొందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని నమ్ముతున్నారు దర్శకనిర్మాతలు. అమెరికాలో ఒక్క ప్రీమియర్ షోల ద్వారా మిలియన్ల డాలర్లను వసూలు చేసింది ఈ సినిమా.