IPL 2022, CSK vs KKR Match preview: ఐపీఎల్‌ (IPL 2022) క్రికెట్‌ ఫెస్టివల్‌ మరికొన్ని గంటల్లో మొదలవుతోంది! వరుసగా రెండు నెలలు ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ (Chennai Superkings), రన్నరప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knightriders) మొదటి మ్యాచులో తలపడుతుండటంతో హీటు మామూలుగా ఉండబోదు! ఈ రెండు జట్లకు కెప్టెన్లు మారిన తరుణంలో ఎవరి బలమేంటి? వాంఖడే పిచ్‌ ఎలా ఉండనుంది? ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎవరెవరు ఉంటారోనన్న ఆసక్తి పెరుగుతోంది!


KKR పై CSKదే డామినేషన్‌


ఐపీఎల్‌లో కొన్ని జట్ల మధ్య పోరాటాలు మామూలుగా ఉండవు. సీఎస్‌కే, కేకేఆర్‌ (CSK vs KKR) మధ్య రైవలరీ అలాంటిదే! చాలాసార్లు ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌లో తలపడ్డాయి. లీగుల్లోనూ నువ్వా నేనా అన్నట్టు ఆడతాయి. కేకేఆర్‌పై చెన్నైదే డామినేషన్‌. ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో 25 సార్లు తలపడితే 17సార్లు ధోనీసేనదే విజయం!  కేకేఆర్‌ కేవలం 8 సార్లే గెలిచింది. చివరి ఐదు మ్యాచుల్లో మాత్రం చెన్నై ఆధిపత్యానికి తిరుగులేదు. చివరి సీజన్లో రెండు లీగు, ఫైనల్లో గెలిచింది. 2020లో మాత్రం చెరోటి గెలిచారు.


Jadduకు అండగా MS Dhoni 


వేలం తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు స్వరూపం మారిపోయింది. కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజా (Ravindra Jadeja) వస్తున్నాడు. అతడికి ధోనీ అండగా ఉంటాడు. దీపక్‌ చాహర్‌ (Deepak chahar) లేకపోవడం కచ్చితంగా లోటే! వాంఖడేలో (Wankhede) వికెట్లు తీసేందుకు అతడెంతో కీలకం. ఇన్నాళ్లూ గాయంతో క్రికెట్‌కు దూరంగా ఉన్న రుతురాజ్‌ (Ruturaj gaikwad) రావడం ఆనందం కలిగించేదే. ఎందుకంటే చివరి సారి అతడు టాప్‌ స్కోరర్‌. పైగా వారికి ఈ ఓపెనర్‌ చాలా ఇంపార్టెంట్‌. డేవాన్‌ కాన్వే, మొయిన్‌ అలీ, అంబటి రాయుడు (Ambati Rayudu), రాబిన్‌ ఉతప్ప బ్యాటింగ్‌ఈలో కీలకం. డ్వేన్‌ బ్రావో, జడ్డూ, క్రిస్‌ జోర్డాన్‌ రాణించాల్సి ఉంటుంది. చెన్నై తరహా వాతావరణ పరిస్థితులు ఉండటం సీఎస్‌కేకు లక్కీ!


దమ్మున్న Shreyas Iyer


ఈసారి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కాస్త ఫ్రెష్‌ లుక్‌తో ఉంది. కెప్టెన్‌గా దమ్మున్న ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) వచ్చాడు. మ్యాచు పరిస్థితులను బట్టి ఇన్నింగ్స్‌ యాక్సిలరేట్‌ చేయడం అతడి స్పెషాలిటీ. మెక్‌కలమ్‌, శ్రేయస్‌ కాంబినేషన్‌ కాస్త క్రేజీగా అనిపిస్తోంది. ఈ జట్టుకు వెంకటేశ్ అయ్యర్‌ (Venkatesh Iyer), నితీశ్ రాణా (Nitish rana), సామ్‌ బిల్లింగ్స్‌, ఆండ్రూ రసెల్‌ (Andre Russell), రహానె బ్యాటింగ్‌లో కీలకం. ఆరోన్‌ ఫించ్‌, కమిన్స్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తారో తెలీదు. బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌ రసెల్‌, నరైన్‌, కమిన్స్‌, మావి, ఉమేశ్‌, వరుణ్‌ చక్రవర్తితో బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లోనే కొద్దిగా వీక్‌నెస్‌ కనబడుతోంది. రసెల్‌ ఫిట్‌నెస్‌ వీరి గెలుపోటములు, ఫినిషింగ్‌ను ఎఫెక్ట్‌ చేయనుంది.


Wankhedeలో టాస్‌ గెలిస్తే మ్యాచ్‌ గెలిచినట్టే


తొలి మ్యాచ్‌ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో (Wankhede) జరుగుతోంది. రాత్రి 7:౩0 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. కొన్నేళ్లుగా అద్భుతమైన మ్యాచులకు వాంఖడే ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ 80 శాతం వరకు ఛేజింగ్‌ టీమ్‌నే విజయం వరిస్తుంది. పిచ్‌ను ఎర్రమట్టితో రూపొందించారు. వాతావరణం డ్యూ ఎఫెక్ట్‌ ఎక్కువ. అందుకే ఇక్కడ పేసర్లు, బంతిని స్వింగ్‌ చేసే బౌలర్లకు తిరుగులేదు. స్పిన్నర్లతో పోలిస్తే వారికే ఎక్కువ వికెట్లు పడతాయి. కాస్త నిలబడితే బ్యాటర్లు పరుగుల వరద పారించగలరు. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 175. ఈ పిచ్‌పై శ్రేయస్‌ పండగ చేసుకుంటాడు. అతడి జీవితకాలంలో ఎక్కువ మ్యాచులు ఆడింది ఇక్కడే. 


Also Read: ఎర్రమట్టి వికెట్లపై గెలిపించేది పేసర్లా? స్పిన్నర్లా? ఏ జట్టుకు బెస్ట్‌!!