Macherla Niyojakavargam Movie Update: హీరో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఆయన గుంటూరు కలెక్టర్‌గా కనిపించనున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. ఈ రోజు సినిమాలో హీరో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సినిమాలో హీరో పేరు ఎన్. సిద్దార్థ్ రెడ్డి. కలెక్టర్ కాబట్టి... ఫస్ట్ ఛార్జ్ అంటూ వినూత్నంగా లుక్ విడుదల చేశారు.


'మీకు నచ్చే, మీరు మెచ్చే మాస్‌తో వస్తున్నా' అని సోషల్ మీడియాలో నితిన్ పేర్కొన్నారు. 'కలెక్టర్ సాబ్ వచ్చేశాడు' అంటూ చిత్రబృందం సోషల్ మీడియాలో పేర్కొంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే... నితిన్ వెనుక పులి వేషాధారణలో ఉన్న వ్యక్తి కత్తి పట్టుకుని దూకడం వంటివి ఉన్నాయి. నితిన్ కళ్ళల్లో ఇంటెన్స్ ఉంది. 







రాజ‌కీయ నేప‌థ్యంతో 'మాచర్ల నియోజకవర్గం' సినిమా తెరకెక్కుతోంది. ఓ యువ కలెక్టర్ ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేది కథాంశంగా తెలుస్తోంది. పక్కా మాస్, కమర్షియల్ అంశాలతో కూడిన కథలో నితిన్ యాక్షన్ రోల్ చేస్తున్నారు.


'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి (ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్) ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇందులో కేథరిన్, కృతి శెట్టి హీరోయిన్లు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రేష్ట్ మూవీస్‌ పతాకాలపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు.


Also Read: సమంత దూకుడుకు సాటెవ్వరు? విడాకుల తర్వాత బ్రాండ్ వేల్యూ పెరిగిందా?


ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. నితిన్‌తో ఆయనకు మూడో చిత్రమిది. ఇంతకు ముందు 'భీష్మ', 'మాస్ట్రో' చేశారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, డైలాగ్స్: మామిడాల తిరుపతి, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: అనల్ అరసు.


Also Read: మలయాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌, తెలుగులో రీమేక్ చేస్తున్న కరణ్ జోహార్