తెలుగమ్మాయి, 'బిగ్ బాస్' ఫేమ్ దివి వడ్త్య (Divi Vadthya bigg boss) ప్రేక్షకులకు తెలుసు. 'బిగ్ బాస్'కి ముందు మహేష్ బాబు 'మహర్షి', 'ఏ1 ఎక్స్ ప్రెస్' సినిమాల్లో... తర్వాత చిరంజీవి 'గాడ్ ఫాదర్', జగపతి బాబు 'రుద్రంగి'తో పాటు కొన్ని సినిమాలు చేశారు. 'మా నీళ్ల ట్యాంక్', 'ఏటీఎం' వెబ్ సిరీస్‌లు సైతం చేశారు. దివి కథానాయికగా నటించిన సినిమా 'లంబసింగి'. ఏ ప్యూర్ లవ్ స్టోరీ... అనేది ఉప శీర్షిక. ఈ మూవీకి హైప్ ఎక్కించడానికి రష్మిక రంగంలోకి దిగారు.


దివి రిక్వెస్ట్... రష్మిక బెస్ట్ విషెస్!
'సోగ్గాడే చిన్ని నాయన', 'రారండోయ్ వేడుక చూద్దాం', 'బంగార్రాజు' సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna Kurasala) 'లంబసింగి'తో నిర్మాతగా మారుతున్నారు. ఆయన సమర్పణలో కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్ తన్నీరు నిర్మించారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. భరత్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ శుక్రవారం (మార్చి 15న) థియేటర్లలో విడుదల అవుతుంది. 


'లంబసింగి' విడుదల సందర్భంగా తన సినిమాకు హైప్ ఎక్కించమని రష్మికను దివి రిక్వెస్ట్ చేశారు. నేషనల్ క్రష్ కథానాయికగా నటిస్తున్న 'పుష్ప 2'లో ఓ కీలక పాత్రలో దివి నటిస్తున్నారు. చిత్రీకరణలో కలిసినప్పుడు 'లంబసింగి' గురించి చెప్పగా... ''మార్చి 15న 'లంబసింగి' విడుదల అవుతోంది. చాలా కష్టపడి తీశారు. అందరూ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి. ఈ మూవీకి సపోర్ట్ చేయండి'' అని చిత్ర బృందానికి రష్మిక బెస్ట్ విషెస్ చెప్పారు.


Also Readఆస్కార్స్‌ చరిత్రలో 56 నామినేషన్లు, 21 అవార్డులు - ఇదీ క్రిస్టోఫర్ నోలన్ ఘనత, 'ఓపెన్ హైమర్' ఒక్కటే కాదు!



ఆంధ్రా కశ్మీర్ లంబసింగి నేపథ్యంలో తొలి సినిమా!
వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్లకు విహార యాత్రలకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు! అటువంటి కూల్ హిల్ స్టేషన్ ఒకటి ఆంధ్రాలోనూ ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులరైన ఆ ఊరి పేరు 'లంబసింగి'. ఆ పేరుతో తెలుగు భాషలో రూపొందుతోన్న తొలి సినిమా దివిది కావడం విశేషం.


Also Readమాపై యుద్ధం ఆపండి... బదులుగా ఆస్కార్ అవార్డు ఇస్తా - రష్యాకు ఉక్రెయిన్ దర్శకుడు మిస్టిస్లావ్ చెర్నోవ్ ఆఫర్


ఈ సినిమా గురించి దర్శకుడు నవీన్ గాంధీ మాట్లాడుతూ "విశాఖ సమీపంలోని లంబసింగి నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది. చిత్రీకరణ అంతా పూర్తి అయ్యింది. సినిమాలో లొకేషన్లు, ఆర్ఆర్ ధృవన్ అందించిన పాటలు హైలైట్ అవుతాయి" అని చెప్పారు. భరత్, దివి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య ఇతర తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: కె. విజయ్ వర్ధన్, ఛాయాగ్రహణం: కె. బుజ్జి (BFA), సాహిత్యం: కాసర్ల శ్యామ్, సంగీతం: ఆర్ఆర్ ధృవన్, నిర్మాణం: కాన్సెప్ట్ ఫిల్మ్స్, సమర్పణ: కళ్యాణ్ కృష్ణ కురసాల, కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: నవీన్ గాంధీ.