తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న కథానాయికలలో రష్మికా మందన్నా (Rashmika Mandanna) ఒకరు. కొత్తగా మరో సినిమాకు సంతకం చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఫర్ ద ఫస్ట్ టైమ్... అక్కినేని హీరో సరసన రష్మిక నటించనున్నారని టాక్. ఆ సినిమా వివరాల్లోకి వెళితే... 


అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కథానాయకుడిగా దర్శకుడు పరశురామ్ (Director Parasuram) ఒక సినిమా చేయనున్నారు. 'సర్కారు వారి పాట' కంటే ముందు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభోత్సవం జరిగింది. కానీ, సెట్స్ మీదకు వెళ్ళలేదు. దానికి కారణం ప్రేక్షకులకు కూడా తెలిసిందే... మహేష్  బాబు నుంచి పిలుపు రావడంతో పరశురామ్ 'సర్కారు వారి పాట' సినిమా చేసి వచ్చారు. ఇప్పుడు నాగ చైతన్య సినిమా స్క్రిప్ట్ మీద కాన్సంట్రేట్ చేశారు.


రష్మికతో లవ్... విలన్లతో యాక్షన్‌తో!
నాగ చైతన్య కోసం లవ్ అండ్ యాక్షన్ అంశాలు మేళవించి దర్శకుడు పరశురామ్ ఒక స్క్రిప్ట్ రెడీ చేశారట. ఇటీవల కథ విన్న అక్కినేని హీరో ఆ స్క్రిప్ట్ ఓకే చేశారని టాక్. ఈ సినిమాలో రష్మికా మందన్నా (Rashmika To Romance Naga Chaitanya In Parasuram Movie) కథానాయికగా నటించనున్నారట.
 
అక్కినేని హీరోతో తొలిసారి!
ఇప్పటి వరకూ అక్కినేని హీరో సరసన కథానాయికగా రష్మిక నటించింది లేదు! కింగ్ నాగార్జున 'దేవ్ దాస్' సినిమాలో ఆమె నటించారు. అయితే... నాగార్జునకు జోడీగా కాదు, నాని సరసన కథానాయికగా కనిపించారు. 'దిల్' రాజు నిర్మాణంలో నాగ చైతన్య, రష్మిక జంటగా ఒక సినిమా రూపొందనుందని కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించాయి. 'థాంక్యూ' సినిమాలో ఒక కథానాయికగా కూడా రష్మిక పేరు వినిపించింది. కానీ, అవేవీ నిజం కాలేదు.


Also Read : విజయ్ దేవరకొండతో లవ్‌పై రష్మికా మందన్నా షాకింగ్ రిప్లై, ఫ్యాన్స్ హర్ట్!


ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో చైతూ - రష్మిక తొలిసారి జంటగా నటిస్తారని టాక్. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. 


ప్రస్తుతం నాగ చైతన్య చేస్తున్న సినిమాలకు వస్తే... తమిళ దర్శకుడు విక్రమ్ ప్రభుతో తెలుగు, తమిళ సినిమా ఒకటి చేస్తున్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో 'దూత' వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ రెండిటి తర్వాత ఏయే ప్రాజెక్ట్స్ ఓకే చేశారనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న 'లాల్ సింగ్ చడ్డా' సినిమా ప్రచార కార్యక్రమాలలో ఆయన బిజీగా ఉన్నారు. రష్మిక విషయానికి వస్తే... తమిళ స్టార్ విజయ్ సరసన 'వారసుడు' సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ రెండు హిందీ సినిమాలు 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' షూటింగ్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ర‌ణ్‌బీర్‌ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'యానిమల్' షూటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్ స్టార్ట్ అయితే జాయిన్ కావడానికి వెయిట్ చేస్తున్నారు.    


Also Read : నా కోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికి అయినా ఒకటే: శ్రుతీ హాసన్