విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు:
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పటివరకు ఆయన హిందీలో ఒక్క సినిమా కూడా చేయలేదు. అలాంటిది నార్త్ లో విజయ్ క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. బీహార్, పాట్నాలలో విజయ్ ని చూడడానికి జనాలు ఎగబడుతున్నారు. 'లైగర్' సినిమా ప్రచారం కోసం విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా.. జనాలు పోటెత్తుతున్నారు. క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక ఈవెంట్స్ ని క్యాన్సిల్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల నావీ ముంబైలో జరిగిన ఈవెంట్ మొత్తం జనాలతో నిండిపోయింది. పాట్నాలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. మొత్తానికి విజయ్ క్రేజ్ చూసి తెలుగు ఆడియన్స్ షాక్ అయిపోతున్నారు.
అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన:
బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రెగ్నంట్. అయినప్పటికీ తన 'బ్రహ్మాస్త్ర' సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. వాటికి సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే అలియా.. ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా కోట్లు సంపాదిస్తోంది. ఈమెకి 68.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దానికి తగ్గట్లే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి లక్షలు ఛార్జ్ చేస్తోంది. ఆమె ప్రమోట్ చేసే వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఒక్కో పోస్టుకు ఏకంగా రూ.85 లక్షలు నుంచి రూ.కోటి వరకు తీసుకుంటుందట. బ్రాండ్ వాల్యూని అట్టి ఈ రేట్ మారుతుందట.
Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం - రెండో పెళ్లి చేసుకోబోతున్న హృతిక్ మాజీ భార్య!
Also Read: పండుగాడి యూఫోరియా - 'పోకిరి' స్పెషల్ షోలకి షాకింగ్ బుకింగ్స్!