Minister Harish Rao: నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి నిధులు ఇవ్వలేదని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నిధులు ఇచ్చినా వాడుకోలేదంని నీతి ఆయోగ్ తప్పుడు ప్రకటన చేసిందని, ఇలా బీజేపీకి నీతి ఆయోగ్ వంతపాడడం సిగ్గుచేటని అన్నారు. నీతిఆయోగ్ పూర్తిగా వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి తప్పుడు ప్రకటన చేశారని విమర్శించారు. నీతిఆయోగ్ రాజకీయ రంగు పులుముకుందని హరీశ్‌రావు ఆరోపించారు.
అంకెల గారడీ చేస్తూ పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు..
నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తూ.. నిన్న సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై సర్వత్రా దుమారం చెలరేగింది. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ నీతి ఆయోగ్ విడుదల చేసిన నోట్ మరింత చర్చకు దారి తీసింది. ఈ నోట్ పై స్పందిస్తూనే మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. సీఎం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోయి తప్పుడు ప్రకటన చేశారని నీతి ఆయోగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థ అంకెలా గారడీ చేస్తూ వాస్తవాలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తుంనది ఆరోపించారు. నిధులు ఇచ్చినా వాడుకోలేదని చెప్పడం దారుణం అన్నారు. నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.
నీతి ఆయోగ్ ప్రకటన అసత్య దూరం..
బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చాలా అన్యాయం చేసిందన్నారు. ఇందిరా గాంధీ, వాజ్ పేయీ మన్మోహన్ ప్రభుత్వాలు ఆర్థిక సంఘం సిఫార్సులను కచ్చితంగా అమలు చేసిందని అన్నారు. ప్రగతి పథంలో దూసుకు పోతున్న తెలంగాణపై ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సిఫార్సులను మోదీ ప్రభుత్వం అమలు చేయలేదన్న హరీశ్ రావు.. దానిపై నీతి ఆయోగ్ ఎందుకు ప్రశ్నించదని అడిగారు. నీతి ఆయోగ్ ప్రకటన సత్య దూరమని ఆరోపించారు. నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం చెత్త బుట్టలో వేసిందన్నారు. కేంద్రం సెస్ లను 10 నుంచి 20 శాతానికి పెంచుకుని.. రాష్ట్రాలకు నిధులు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీతి ఆయోగ్ రికమెండేషన్ ను చెత్తబుట్టలో వేసింది..
సెస్ ల దర్వారా కేంద్రం 15.47 లక్షల కోట్లు సమకూర్చిందని అందులో రాష్ట్రాల వాటా 8.60 కోట్లు రావాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్రాలకు 29.6 శాతమే ఇస్తోందని దుయ్యబట్టారు. నీతి ఆయోగ్ ప్రకటన పూర్తిగా రాజకీయ కోణంలో ఉందని అన్నారు. నీతి ఆయోగ్ చెప్పినా కేంద్ర నిధులు ఇవ్వకపోగా.. ఆ సంస్థ రికమెండేన్ ను చెత్తబుట్టలో వేసిందన్నారు.