విజయ్ దేవరకొండ, రష్మిక.. వీరిపై వస్తున్న రూమర్స్ గురించి మీకు తెలిసిందే. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, సహజీవనం కూడా చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే, దీనిపై విజయ్ దేవరకొండ ‘కాఫీ విత్ కరణ్ - సీజన్ 7’లో స్పష్టత ఇచ్చాడు. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని తెలిపాడు. అయితే, రౌడీబాయ్ తన లవ్‌ను కవర్ చేస్తున్నాడని, ఇప్పటికీ వారిద్దరు ప్రేమలోనే ఉన్నారని కొందరు వాదిస్తున్నారు. ఇలా అంటోంది మరెవ్వరో కాదు.. రష్మిక-విజయ్ దేవరకొండల కామన్ ఫ్యాన్స్. ఔనండి, వీరికి కామన్‌గా అభిమానులు ఉన్నారు. వీరిని జంటగా చూడాలని, పెళ్లి చేసుకోవాలని బలంగా కోరుకొనే ఈ అభిమానులు.. వీరు ప్రేమించుకోవడం లేదంటే అస్సలు నమ్మలేకపోతున్నారు. పైగా రష్మిక మందన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఇంకా సింగిలే అని చెప్పేయడంతో వారు మరింత హర్ట్ అవుతున్నారు. 


కాఫీ విత్ కరణ్‌లో విజయ్‌కు రష్మిక గురించే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆమెతో తనకున్న అనుబంధం గురించి మొదటిసారి నోరువిప్పాడు. రష్మిక తనకు చాలా స్పెషల్ అని, ఆమె తన డార్లింగ్ అని చెప్పాడు. అయితే, అనన్య పాండే మాత్రం విజయ్-రష్మిక మధ్య ఏదో ఉందన్నట్లే హింట్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు విజయ్-రష్మిక పెళ్లి చేసుకోనున్నారనే రూమర్స్ షికారు చేస్తున్నాయి. అయితే, రష్మిక-విజయ్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారని, రెండేళ్ల కిందటే వారికి బ్రేకప్ అయ్యిందని, వారిద్దరూ ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అని  బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా దీనిపై రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్‌ మంచి ఫ్రెండ్ మాత్రమేనని, ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టత ఇచ్చింది. తాను ఇప్పటికీ సింగిల్‌ అని వెల్లడించింది. దీంతో వీరిద్దరిని జంటగా చూద్దామని ఆశించిన అభిమానులు చాలా ఫీలైపోతున్నారు. మీ జంట క్యూట్‌గా ఉంటుందని, పెళ్లి చేసుకోండని అడుగుతున్నారు. 


ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక బాలీవుడ్‌లో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్’ సినిమా తర్వాత రష్మికాకు హిందీ సినిమాల్లో అవకాశాలు క్యూకట్టాయి. విజయ్ ‘లైగర్’ సినిమాతో గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. రష్మికా ఏకంగా బాలీవుడ్ సినిమాల్లోనే ఛాన్సులు కొట్టేసింది. ‘గుడ్‌బై’, ‘మిషన్ మజ్ను’, ‘యానిమల్’, తెలుగులో ‘పుష్ప: ది రూల్’, ‘వారసుడు’ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా తెరకెక్కింది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇందులో విజయ్ ముంబయి మురికి వాడకు చెందిన యువకుడిగా ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఆయన పాత్రలో రమ్య కృష్ణ నటించారు. అనన్యా పాండే కథానాయిక మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. విజయ్ దేవరకొండ నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రం ఇది. ధర్మా ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం సక్సెస్‌పై పూరీ టీమ్ చాలా ఆశలు పెట్టుకుంది. 


Also Read: ‘బింబిసార’ రివ్యూ: మద గజ మహా చక్రవర్తిగా నందమూరి కళ్యాణ్ రామ్ మెప్పించారా? లేదా?
Also Read: వైఎస్ జగన్ బయోపిక్ చేయడానికి రెడీ - దుల్కర్ సల్మాన్ కామెంట్స్!