ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని లాస్య పాడు చెయ్యాలని చూస్తుంది ఏం చెయ్యాలని తులసి మనసులోనే టెన్షన్ పడుతుంది. సామ్రాట్, నందు హ్యాండ్ రెజ్లింగ్ పోటీలకు దిగుతారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మీ అండ చూసుకుని తులసి రెచ్చిపోతుంది తులసిని ఓడించాలి నేను ఒడిపోకూడదు అని నందు కసిగా ఉంటాడు. ఇదేంటి నందు ఒడిపోయేలా ఉన్నాడని లాస్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక తులసి బాధ, టెన్షన్ గా ఉండటం చూసి ఏమైందని సామ్రాట్ సైగ చేస్తాడు ఏమి లేదని అంటుంది. తులసి మొహం చూసి సామ్రాట్ తన కోసం ఓడిపోవాలని అనుకుంటూ నందు గెలిచేలా చేస్తాడు. ఇక నందు గెలిచినందుకు అందరూ కంగ్రాట్స్ చెప్తారు. ఇక తులసి కృతజ్ఞతా భావంతో సామ్రాట్ వైపు చూస్తుంది.


Also Read: యష్, వేద, మధ్యలో ఓ దొంగోడు - దొంగతో కామెడీ చేసిన యష్


తులసి దగ్గరకి సామ్రాట్ వచ్చి థాంక్స్ చెప్తాడు. గెలవాల్సిన మిమ్మల్ని ఒడిపోయేలా చేశాను అని తులసి సామ్రాట్ కి క్షమాపణ చెప్తుంది. ఆటలో గెలవడం కన్నా మర్యాదతో ఒక మనిషిని గెలిపించడం ఎంత తృప్తిని ఇస్తుందో తెలిసేలా చేశారు. ఆతిధ్యం ఇచ్చిన వ్యక్తిని ఇంటికి పిలిచి ఓడించడం అవమానపరచడమే.. ఈ చిన్న విషయం నాకు ఎందుకు తట్టలేదు అని అనుకుంటాడు. ఇక సామ్రాట్ తులసిని తెగ పొగిడేస్తాడు. ఇక ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ ఉన్న గులాబీని తెచ్చి సామ్రాట్ తులసికి ఇస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి అలా మాట్లాడుకోవడాన్ని చూసి అనసూయ, పరంధామయ్య సంతోషిస్తారు. సామ్రాట్ తులసికి గులాబీ పువ్వు ఇవ్వడం చూసి నందు రగిలిపోతాడు. తులసిగారు మీకోక సర్ప్రైజ్ చేశాను అని సామ్రాట్ చెప్తాడు.


Also Read: రుక్మిణిని అమ్మలా చూసుకున్న చిన్మయి- తన ఫోటోకి మీసాలు గీసి మానాయన ఇలాగే ఉంటాడు వెతకమంటున్న దేవి


మా హనీని స్కూల్ కాంపిటీషన్లో గెలిపించినందుకు తులసిగారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటునట్టు ఇంట్లో అందరికీ చెప్తాడు సామ్రాట్. హనీ టాలెంట్ వల్లే గెలిచింది నేను చేసింది ఏమి లేదని తులసి అంటుంది. ఇక గిఫ్ట్ తీసుకురమ్మని సామ్రాట్ పనివాళ్ళకి చెప్తాడు. అదంతా చూసి లాస్య కుళ్ళుకుంటూ నువ్వే తులసి మాజీ భర్తవని చెప్పేస్తాను ఈ ఓవర్ యాక్షన్ తగ్గిస్తానని నందుతో అంటుంది. నువ్వే తెలియకూడదని చెప్పి నువ్వే చెప్తాను అంటా వెంటీ అని నందు ఆపుతాడు. ఈ రోత చూడలేకపోతున్నాను అని లాస్య చిరాకు పడుతుంది. ఇక తులసి గిఫ్ట్ ఓపెన్ చేసి ఎమోషనల్ అవుతుంది. ఏ రవ్వల నెక్లెస్ ఇస్తాడాని అనుకుంటే చెక్కపెట్టే పెట్టాడు ఏంటి అని లాస్య అనుకుంటుంది. తులసికి ఎంతో ఇష్టమైన వీణని గిఫ్ట్ గా ఇస్తాడు. చాలా థాంక్స్ అంది బహుమతి నచ్చిందని తులసి అంటుంది. నేను మీకు గిఫ్ట్ ఇచ్చాను మీరు కూడా మాకు గిఫ్ట్ ఇవ్వండి ఈ వీణ మీటుతూ ఒక పాట పాడాల్సిందే అని అందరూ అడుగుతారు. ఇక తులసి సంగీత కచేరీ మొదలు పెట్టేస్తుంది. అది విని అందరూ తెగ చప్పట్లు కొట్టేసి పొగిడేస్తారు. అందరూ చప్పట్లు కొట్టిన నందు ఏం చేయకపోవడంతో సామ్రాట్ అడిగేస్తాడు. ఇంత మంచి గొంతు పెట్టుకుని ఎందుకు ఇంత కాలం దాచి పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశారు అని సామ్రాట్ అంటాడు.


తరువాయి భాగంలో..


తులసి విషయంలో పాపం ఆమె భర్త ప్రాబ్లం ఎంతో మనకి ఎలా తెలుస్తుంది అని లాస్య అంటుంది. నిజమెంటో చెప్పగలిగేది తులసి మాత్రమే అని సామ్రాట్ బాబాయ్ అంటాడు. మీ మధ్య అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకు వదిలేశాడు పెద్దాయన తులసిని అడగటంతో నందు, తులసి ఆశ్చర్యపోతూ ఉంటారు.