భారత ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RINL) ఆధ్వర్యంలోని విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌, అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 319 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 2న ప్రారంభమైంది. ఆన్‌లైన్ ద్వారా ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరితేదిని ఆగస్టు 18గా నిర్ణయించారు. 

వివరాలు..

* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు 

ఖాళీల సంఖ్య: 319

రిజర్వేషన్లు: జనరల్-134, ఈడబ్ల్యూఎస్-32, ఓబీసీ-89, ఎస్సీ-20, ఎస్టీ-44. 

ట్రేడ్ల వారీగా ఖాళీలు:

1) ఫిట్టర్- 80


2) టర్నర్- 10


3) మెషినిస్ట్- 14


4) వెల్డర్(గ్యాస్, ఎలక్ట్రిక్)- 40


5) మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్- 20


6) ఎలక్ట్రీషియన్- 65


7) కార్పెంటర్- 20


8) మెకానిక్ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్- 10


9) మెకానిక్ డీజిల్- 30


10) కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-30

కాల వ్యవధి: ఒక సంవత్సరం.

స్టైపెండ్: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, ఎలక్ట్రీషియన్, ఆర్ & ఏసీ పోస్టులకు నెలకు రూ.8,050; వెల్డర్, కార్పెంటర్, మెకానిక్ డీజిల్, కోపా పోస్టులకు నెలకు రూ.7,700 స్టైపెండ్‌గా ఇస్తారు.  

అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత. ఎన్‌టీవీ సర్టిఫికేట్ ఉండాలి.

వయోపరిమితి: 01.04.2022 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాలు (ఎస్సీ, ఎస్టీలకు 15 సంవత్సరాలు, 13 సంవత్సరాల వరకు నాన్ క్రిమిలేయర్ దివ్యాంగ అభ్యర్థులకు) వయోసడలింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100. ఆన్‌లైన్ పరీక్ష సమయంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు రీఫండ్ చేస్తారు. 

పరీక్ష విధానం: ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే పరీక్షలో మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. 

a) ఆప్టిట్యూడ్ (సెగ్మెంట్-1): ఈ విభాగంలో 75 ప్రశ్నలు అడుగుతారు. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్, జనరల్ ఆప్టిట్యూడ్ (అరిథ్‌‌మెటిక్, రీజినింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్) నుంచి ప్రశ్నలు ఉంటాయి.

b) టెక్నికల్ (సెగ్మెంట్-1): ఈ విభాగంలోనూ 75 ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థుల సంబంధిత ట్రేడ్‌ నుంచి ఐటీఐ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

c) తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. 

రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్‌ను 50 పర్సంటైల్‌గా; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు కటాఫ్‌ను 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు. పరీక్షలో ఒకే మార్కులు వచ్చిన పక్షంలో.. అభ్యర్థుల వయసు ఆధారంగా మెరిట్‌లిస్ట్ తయారుచేస్తారు. విశాఖపట్నంలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కోసం వచ్చే అభ్యర్థులకు ఎలాంటి భత్యాలు ఇవ్వరు.



ముఖ్యమైన తేదీలు...



  • నోటిఫికేషన్ విడుదల తేది: 02.08.2022.


  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.08.2022. 


  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 18.08.2022 (సా.6 గంటల్లోగా)


  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ తేది: 04.09.2022.


Notification

Online Registration