శాంసంగ్ తన గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్ ఫోన్ ధరను రూ.2,000 మేర తగ్గించింది. ఈ ఫోన్ మనదేశంలో గతేడాది లాంచ్ అయింది. ఇందులో 6.6 అంగుళాల ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ ధర
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.19,999గా ఉండగా... ఇప్పుడు అది రూ.17,999కు తగ్గింది. అలాగే 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 నుంచి రూ.19,999కు తగ్గింది.


శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. 2.2 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. అలాగే ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కూడా ఉండటం విశేషం.


శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 ధరను అయితే ఏకంగా రూ.14,500 మేర తగ్గించారు. ప్రస్తుతం ఈ వాచ్ ధర మనదేశంలో రూ.26,999గా నిర్ణయించారు. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 ధరను కూడా కంపెనీ త్వరలో తగ్గించనుందని తెలుస్తోంది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!