తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఇంట పెళ్లి సందడి నెలకొనబోతోంది. ఆయన రెండో తనయుడు, రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ పెళ్లి ఖరారైనట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా అభిరామ్ పెళ్లి గురించి ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పెళ్లి ముహూర్తం, వివాహ వేదిక కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వార్తలను సురేష్ బాబు కన్ఫర్మ్ చేశారు. త్వరలో అభిరామ్ పెళ్లి జరగబోతున్నట్లు వెల్లడించారు.
అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే?
అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? అనే విషయాన్ని నెటిజన్లు బాగా సెర్చ్ చేస్తున్నారు. అయితే, పెళ్లి కూతురు వాళ్ల బంధువులు అమ్మాయేనట. మూవీ మొఘల్, దివంగత రామానాయుడు తమ్ముడి మనువరాలినే అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్నాడట. అంటే, సురేష్ బాబు చెల్లెలి కూతురితోనే ఏడు అడుగులు నడవబోతున్నాడు. అభిరామ్, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకరికొకరు ఇష్టపడుతున్నారట. వారి ఇష్టం మేరకు ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి ఓకే చెప్పారట. అమ్మాయి ఫారిన్ లో చదువుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కారంచేడులోనే అమ్మాయి కుటుంబం ఉంటోంది. రీసెంట్ గానే ఇరు కుటుంబ సభ్యులు కలిసి ఈ పెళ్లి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
శ్రీలంకలో అభిరామ్ పెళ్లి వేడుక
ఇక అభిరామ్ పెళ్లి ముహూర్తంతో పాటు పెళ్లి వేదిక కూడా ఫిక్స్ అయినట్లు సురేష్ బాబు వెల్లడించారు. అభి పెళ్లి ఇండియాలో కాకుండా, శ్రీలంకలో జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిమంది బంధువులు, సన్నిహితుల నడుమ ఈ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న శ్రీలంకలో ఈ పెళ్లి వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లికి సంబంధించిన శుభలేఖలు కూడా సరికొత్తగా డిజైన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. రామానాయుడు సొంతూరు కారంచేడులోని పాత ఇల్లు డిజైన్‌ను శుభలేఖల మీద అచ్చువేయిస్తున్నారట కుటుంబ సభ్యులు.
దగ్గుబాటి అభిరామ్ గురించి..
కొద్దికాలం క్రితం అభిరామ్ (Abhiram Daggubati Marriage)పై నటి శ్రీరెడ్డి పలు ఆరోపణలు చేయడంతో వార్తల్లోకి ఎక్కాడు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అభిరామ్ మోసం చేశాడంటూ శ్రీరెడ్డి అప్పట్లో పెద్ద రచ్చ చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ వివాదం సర్దుమణిగింది. రీసెంట్ గా ‘అహింస’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అభిరామ్. తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే, బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఈ మూవీ హిట్ అందుకోలేకపోయింది. తొలి సినిమాతోనే ఫ్లాప్ ఎదురుకావడంతో, ఇప్పటికే ఓకే చేసిన కొన్ని సినిమాలను కూడా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓ కాఫీ షాపును ఓపెన్ చేసే పనిలో ఉన్నాడట. రామానాయుడు స్టూడియో పక్కనే ఈ కాఫీ షాప్ ఓపెన్ చేయబోతున్నాడట. 2020లో అన్న రానా మిహికా బజాజ్ ను పెళ్లి చేసుకుని సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రస్తుతం అభిరామ్ కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతుండటంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు చెప్తున్నారు.
Read Also: నాలుగు నెలల పాటు సినిమాలకు బ్రేక్, ప్రభాస్ కీలక నిర్ణయం- కారణం ఏంటో తెలుసా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial