మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) బావమరిది నార్నే నితిన్ (Narne Nithin) ఓ హీరోగా నటించిన చిత్రం 'మ్యాడ్' (MAD Movie). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా ఇది. ఈ నెలాఖరున విడుదల చేయాలని భావించారు. లేటెస్ట్ బజ్ ఏమిటంటే... ఆ రోజు సినిమా విడుదల కావడం లేదట!


సెప్టెంబర్ 28న 'మ్యాడ్' లేనట్టే!
సెప్టెంబర్ 28న 'మ్యాడ్' విడుదల చేయనున్నట్లు సెప్టెంబర్ 1న అనౌన్స్ చేశారు. ఆ ప్రకటన వెనుక రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' ఉంది. ఆ సినిమా విడుదల వాయిదా పడిందని డిస్ట్రిబ్యూషన్ వర్గాలకు తెలిసిన వెంటనే... సెప్టెంబర్ 28 మీద 'మ్యాడ్' నిర్మాతలు ఖర్చీఫ్ వేశారు. అయితే... 'సలార్' వాయిదాతో నాలుగైదు సినిమాలు వచ్చి పడ్డాయి. దాంతో అన్ని సినిమాల మధ్య విడుదల చేయడం కంటే కాస్త వెనక్కి వెళ్ళడం మంచిదని చిత్ర బృందం భావించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.  


'మ్యాడ్' సినిమాలో తొలి పాట 'ప్రౌడ్స్ సింగిల్...'ను ఇవాళ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ గమనిస్తే... అందులో విడుదల తేదీ లేదు. వై? అంటే... సినిమా విడుదల వాయిదా పడిందని తెలిసింది.


Also Read : రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్ - 'దేవర' కథలో అసలు ట్విస్ట్ ఇదే!?






'మ్యాడ్' చిత్రాన్ని (Mad Movie Telugu) సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హారిక సూర్యదేవర నిర్మిస్తున్నారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ సంస్థపై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.


'మ్యాడ్' సినిమాలో మరో ఇద్దరు హీరోలు!
Mad Telugu Movie Cast : 'మ్యాడ్'తో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నార్నే నితిన్ ఓ కథానాయకుడు కాగా... సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, యూట్యూబర్ రామ్ నితిన్ మరో ఇద్దరు కథానాయకులు. శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. 


Also Read : తెలుగులో పవన్... తమిళంలో విజయ్... స్టార్ హీరోలతో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!



యువతను టార్గెట్ చేస్తూ తీసిన సినిమా!
'మ్యాడ్' టీజర్ చూస్తే సినిమా జానర్ ఏమిటి? అనేది ఈజీగా అర్థం అవుతోంది. మరీ ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ తీసిన కామెడీ ఫిల్మ్ అని చెప్పవచ్చు. టీజర్లో కొన్ని డైలాగుల్లో డబుల్ మీనింగ్ ధ్వనించింది. సినిమా ఎలా ఉంటుంది? అనేది విడుదలైన తర్వాత తెలుస్తుంది. త్వరలో ట్రైలర్ విడుదల చేయడానికి ప్లాన్ చేశారట. 


రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'మ్యాడ్' చిత్రానికి ఫైట్ మాస్టర్ : కరుణాకర్, అడిషనల్ స్క్రీన్ ప్లే : ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కళ్లపల్లి, కళా దర్శకత్వం : రామ్ అరసవిల్లి, కూర్పు : నవీన్ నూలి, ఛాయాగ్రహణం : షామ్‌ దత్ సైనుద్దీన్ - దినేష్ కృష్ణన్ బి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థలు : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సమర్పణ : సూర్యదేవర నాగ వంశీ, నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య, రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial