Upasana Valentines Day Special Post: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్‌గా ఉంటూనే, మరోవైపు మెగా కోడలిగా, తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అంతే కాకుండా తన వంతుగా సాయం చేస్తూ, సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. సాయంలోనూ గొప్ప మనసు చాటుకుంటున్న మెగా కోడలు ఏం చేసినా హాట్ టాపిక్కే. తాజాగా ఉపాసన వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ జోక్‌ని పంచుకుంటూ, దానిపై ఆసక్తికరంగా స్పందించారు.
వాలెంటైన్స్ డే పోస్ట్‌పై ఉపాసన రియాక్షన్
శుక్రవారం వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులంతా స్పెషల్‌గా విషెస్ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో వాలెంటైన్స్ డేకి సంబంధించిన కోట్స్ తెగ వైరల్ అవుతుంటాయి. అలాగే మరోవైపు పెద్ద ఎత్తున మీమ్స్ సందడి చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన సోషల్ మీడియా వేదికగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేశారు. అందులో "వాలెంటైన్స్ డే అంటే 22 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిల కోసం మాత్రమే. మీ వయసు ఆల్రెడీ అంతకంటే ఎక్కువే అయితే... ఆంటీ ప్లీజ్ వెయిట్ చేయండి... అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం" అంటూ ఉన్న కోట్‌ని షేర్ చేసింది. దానికి నవ్వుతున్న ఎమోజిని ఉపాసన షేర్ చేయడంతో, ఆ పోస్ట్ స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఉపాసన డైనమిక్ లేడీ మాత్రమే కాదు, ఆమెలో మంచి సెన్సాఫ్ హ్యూమర్, కామెడీ యాంగిల్ కూడా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: లైలా మూవీ రివ్యూ: లేడీ గెటప్ వేస్తే చాలా? థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమాను చూడగలమా?
ఇదిలా ఉండగా ఉపాసన, టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి కూడా చేసుకున్నారు. వీరిద్దరికి దాదాపు 12 ఏళ్ల తర్వాత పండంటి మెగా ప్రిన్సెస్ పుట్టింది. ఆమెకు క్లీంకారా అని పేరు పెట్టారు. సోషల్ మీడియాలో ఉపాసన అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన వెకేషన్ ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకుంటారు. కానీ ప్రతీసారి క్లీంకార ఫేస్ మాత్రం ఏదో ఒక ఎమోజీతో కవర్ చేస్తున్నారు. తమ వారసురాలి ఫేస్‌ను మెగా ఫ్యామిలీ ఇప్పటివరకూ రివీల్ చేయలేదు.
పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న చెర్రీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది 'గేమ్ ఛేంజర్' మూవీతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ డిసప్పాయింట్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ ఫలితాన్ని పక్కన పెట్టి, బుచ్చిబాబు దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ చేశారు రామ్ చరణ్. జాన్వి కపూర్ హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ మూవీ క్రికెట్ నేపథ్యంలో సాగుతుంది. రామ్ చరణ్ కెరీర్‌లో 16వ సినిమాగా తెరకెక్కుతున్న 'ఆర్సీ 16' శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఓ మైథలాజికల్ మూవీని చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నారని టాక్ నడుస్తోంది. మరోవైపు 'హాయ్ నాన్న' మూవీతో మంచి డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శౌర్యువ్‌తో చెర్రీ ఇంకో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇటీవల శౌర్యువ్... రామ్ చరణ్‌కు స్టోరీ వినిపించారని, కథలో కొత్తదనం ఉండడం, తన రోల్ నచ్చడంతో చెర్రీ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలపై ఇంకా అఫీషియల్‌గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.