Rahul Ravindran's Father Ravindran Narasimhan Passed Away: ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ (Ravindran Narasimhan) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ విషయాన్ని రాహుల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. 'కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపిన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి నాన్న.' అంటూ ఆయన ఎమోషనల్ కోట్ రాశారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాహుల్ రవీంద్రన్‌కు సంతాపం తెలియజేస్తున్నారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ అండగా నిలుస్తున్నారు.

ఈ విషాద సమయంలో రాహుల్ రవీంద్రన్ తాను దర్శకత్వం వహించిన 'చి.ల.సౌ' చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. 'చి.ల.సౌ చిత్రానికి నేను ఓ లైన్ రాశాను. ఇప్పుడు అది భిన్నంగా అనిపిస్తుంది. నాన్న ఉన్నారులే.. అన్నీ చూసుకుంటారు. అనే మాటకు విలువ నాన్నను కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది. నాకు ఈ రోజు అర్థమైంది. నాన్న లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. మాటల్లో వివరించలేని భావాలను మనకు అందిస్తుంది. థాంక్యూ నాన్న.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.' అంటూ రాహుల్ ఎమోషన్‌కు గురయ్యారు.

Also Read: ఎవరీ కోడి రామ్మూర్తి నాయుడు? 'తండేల్' సక్సెస్ తర్వాత మరో ఉత్తరాంధ్ర కథపై కన్నేసిన అల్లు అరవింద్

కాగా, రాహుల్ రవీంద్రన్.. 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ అందుకున్న రాహుల్ అనంతరం పలు చిత్రాల్లో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించారు. పలు సినిమాల్లో విలన్ పాత్రల్లో సైతం మెరిశారు. నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్.. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదను పెళ్లాడారు. వీరికి ఇద్దరు కవలలు ఉన్నారు.

Also Read: మమ్ముట్టి సినిమాకు అరుదైన గుర్తింపు - ప్రతిష్టాత్మక లండన్ ఫిలిం స్కూల్లో పాఠంగా 'భ్రమయుగం'