Mammootty's Bramayugam Becomes Case Study At UK Film School: 2004లో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మలయాళ సినిమాల్లో మమ్ముట్టి 'భ్రమయుగం' కూడా ఒకటి. ఈ హర్రర్ మూవీలో బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్‌లో రూపొందినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన 'భ్రమయుగం' మూవీ 90 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ యూకేలోని యూనివర్సిటీ ఫర్ ది క్రియేటివ్ ఆర్ట్స్ పాఠ్యాంశాల్లో భాగం కావడం విశేషం.
లండన్ స్కూల్లో పాఠంగా 'భ్రమయుగం'
మమ్ముట్టి లీడ్ రోల్‌లో నటించిన మలయాళ హారర్ మూవీ 'భ్రమయుగం' యూకేలోని ప్రతిష్టాత్మక లండన్ ఫిలిం స్కూల్ యూనివర్సిటీ ఫర్ ది క్రియేటివ్ ఆర్ట్స్ పాఠ్యాంశాల్లో చోటు సంపాదించుకుంది. ఇన్స్టాగ్రామ్‌లో ఓ విద్యార్థి షేర్ చేసిన ఈ వీడియోలో అక్కడి లెక్చరర్ 'భ్రమయుగం' సినిమా సౌండ్ డిజైన్‌ని విశ్లేషించి, హాలీవుడ్ ఫ్యాంటసీ మూవీ 'హ్యారీ పోటర్' సిరీస్‌తో పొలుస్తూ కన్పించారు. పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్‌గా మారడంతో, మలయాళ మూవీ లవర్స్ 'భ్రమయుగం' సినిమాకు దక్కిన ఈ అంతర్జాతీయ గుర్తింపును సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Also Read: నన్ను తొక్కేయాలని, నలిపేయాలని చూస్తారా? విష్ణు మీద ఇన్ డైరెక్టుగా మంచు మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
థియేటర్లలో రిలీజ్ అయిన టైంలో 'భ్రమయుగం' మూవీ విజువల్స్, సౌండ్ డిజైన్, టెక్నికల్ క్వాలిటీ వంటి వాటిపై ప్రశంసల వర్షం కురిసింది. ఇక ఇప్పుడు అంతర్జాతీయంగా ఇవే అంశాలను పరిగణిస్తూ, ఆ సౌండ్ డిజైన్ వింత, భయంకరమైన వాతావరణం క్రియేట్ చేయడంలో హెల్ప్ చేస్తుందని ఆ యూనివర్సిటీ లెక్చరర్ హైలెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రాహుల్ సదా శివన్, నటుడు అర్జున్ అశోకన్, మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో జేవియర్ తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ వీడియోలను షేర్ చేసుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
'భ్రమయుగం' ఏ ఓటీటీలో ఉందంటే ?
20204 ఫిబ్రవరిలో 'భ్రమయుగం' మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఈ హర్రర్ స్టోరీలో సౌండ్ విజువల్స్ వినూత్నంగా ఉండడంతో మంచి ప్రేక్షకాదరణ దక్కింది. రూ.95 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. ఇందులో అర్జున్ అశోక్, సిద్ధార్థ భరతన్, అమల్డా లిజ్ కీలక పాత్రల్లో నటించారు. బ్లాక్ అండ్ వైట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను కొచ్చి, ఒట్టపలంలో భారీ స్థాయిలో నిర్మించారు. జానపద కథలు, ఫ్యాంటసీని మిళితం చేసి ప్రేక్షకులకు ఒక హాంటింగ్ సినీమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 'భ్రమయుగం' మూవీ రిలీజ్ టైమ్‌లో వివాదాన్ని కూడా ఎదుర్కొంది. ఈ మూవీలో హీరో రోల్‍కు పెట్టిన పేరుపై అభ్యంతరాలు వ్యక్తం కాగా, ఆ తరువాత మేకర్స్ మార్చి, మూవీని రిలీజ్ చేశారు.