Pawan Kalyan's Hari Hara Veera Mallu Movie Latest Updates: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). తాజాగా, ఈ సినిమా నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌తో పాటు సెకండ్ సింగిల్ రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. 'కొల్లగొట్టినాదిరో' (Kollagottinadhiro) అంటూ సాగే రొమాంటింక్ సాంగ్‌ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు పవన్, హీరోయిన్ నిధి అగర్వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో నిధి అగర్వాల్‌ను పవన్ పొగుడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 'మాట వినాలి' అంటూ వచ్చిన ఫస్ట్ సింగిల్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా అప్‌డేట్‌తో పవన్ వాలెంటైన్స్ డే ట్రీట్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సినిమా రిలీజ్ అప్పుడేనా..
కాగా, పవన్ కల్యాణ్ హీరోగా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా 'హరిహర వీరమల్లు'.. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపుందుతోంది. అయితే, క్రిష్ సినిమాకు సగానికి పైగా దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 2 భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండో పార్ట్ మొత్తాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కిస్తారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మూవీ నిర్మిస్తుండగా.. అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, నిధి అగర్వాల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తొలి భాగానికి సంబంధించి షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుండగా.. మార్చి 28న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. 'హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో విడుదల కానుండగా.. చెప్పిన టైంకు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్నట్లు సమాచారం. అటు, పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో షూటింగ్ అప్ డేట్స్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, హరిహర వీరమల్లు వస్తుంది కాబట్టే.. విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ మూవీ 'కింగ్ డమ్'ను సమ్మర్ చివరిలో ప్లాన్ చేసినట్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అనుకున్న ప్రకారమే సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు.
Also Read: 'తండేల్' టీం జోష్ మామూలుగా లేదుగా! - సాయిపల్లవితో అల్లు అరవింద్ డ్యాన్స్ అదుర్స్, వైరల్ వీడియో