Thandel First Week Record Collections: అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన 'తండేల్' (Thandel) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాగా.. ఆ రోజు నుంచే భారీగా వసూళ్లు రాబడుతోంది. తొలి రోజు రూ.21 కోట్లతో మొదలైన ప్రయాణం.. రూ.100 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.90.12 కోట్లు వచ్చినట్లు చెబుతూ 'వాలెంటైన్స్ బ్లాక్ బస్టర్'గా పేర్కొంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా శుక్రవారం మరింత కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అటు, శని, ఆదివారాలు వీకెండ్స్ కావడంతో థియేటర్లు ఫుల్ అవుతాయని  సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అటు, రిలీజైన 3 రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తాజా కలెక్షన్లతో మూవీ టీం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో 'తండేల్' థాంక్యూ మీట్ నిర్వహించారు.






మొదటి రోజే రూ. 11.5 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో భారీ ఓపెనింగ్‌తో రాజులమ్మ జాతర స్టార్ట్ చేసిన నాగచైతన్య వారం రోజుల్లోనూ అదే జోరు కొనసాగించారు. 3 రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. కేవలం మూడు రోజుల్లోనే నాగచైతన్య ఏకంగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరడం సంచలనగా మారింది. ఆయనకు మొదటి పాన్ ఇండియా మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ వచ్చిందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాత బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మించారు.


Also Read: తండ్రీ కొడుకుల మధ్య వివాదం అను'బంధం'గా మారేనా! - ఏడ్పించేసిన కమెడియన్ ధన్‌రాజ్, 'రామం రాఘవం' ట్రైలర్ రిలీజ్


నాగచైతన్య, సాయిపల్లవి నటనకు ఫిదా


ఉత్తరాంధ్రలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా 'తండేల్' మూవీని దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించారు. శ్రీకాకుళం జిల్లాలోని కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి పొరపాటున పాక్ సముద్ర జలాల్లోకి వెళ్లగా.. అక్కడ కోస్ట్ గార్డు అధికారులు వారిని జైల్లో వేస్తారు. వారిని రక్షించుకునేందుకు కుటుంబసభ్యులు ఏం చేశారు.? ఈ కథకు లవ్ స్టోరీ, ఎమోషన్స్, దేశభక్తిని మిక్స్ చేసి 'తండేల్'ను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అద్భుతంగా రూపొందించారు. నాగచైతన్య, సాయిపల్లవి నటనకు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. దీంతో సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్లను రాబడుతోంది. అటు, శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో గురువారం సాయంత్రం మూవీ టీం థాంక్యూ మీట్ నిర్వహించగా.. సాయిపల్లవి, నాగచైతన్య, అల్లు అరవింద్ డ్యాన్సులతో ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపారు. ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.


Also Read: మమ్ముట్టి సినిమాకు అరుదైన గుర్తింపు - ప్రతిష్టాత్మక లండన్ ఫిలిం స్కూల్లో పాఠంగా 'భ్రమయుగం'