గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా రూపొందుతున్న కొత్త సినిమా హైదరాబాద్ (RC 16 Movie Launch)లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకుడు. హీరోగా చరణ్ 16వ చిత్రమిది. అందుకని RC 16 అని వ్యవహరిస్తున్నారు.


ముఖ్య అతిథిగా మెగాస్టార్...
పూజకు విచ్చేసిన రెహమాన్!
రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలకు ఆయన సైతం విచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' దర్శకుడు శంకర్, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తదితరులు అతిథులుగా విచ్చేశారు. 






RC16 Movie Pooja Ceremonyలో మరో ప్రత్యేక ఆకర్షణ అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ భామ నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆవిడ నటిస్తున్నారు. పూజా కార్యక్రమాల్లో లంగా ఓణీలో ఆమె సందడి చేశారు.


Also Readమమ్ముట్టిని అరెస్ట్ చేసిన జయరామ్ - మలయాళంలో 40 కోట్లు వసూలు చేసిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?






ఈ చిత్రాన్ని సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సమర్పణలో ఆయనకు చెందిన వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై సినిమా రూపొందుతోంది. పూజతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. 


Also Readశవం చుట్టూ సాలెగూడు, తాంత్రిక పూజలు - ఇంట్రెస్టింగ్‌గా నవీన్ చంద్ర 'ఇన్‌స్పెక్టర్ రిషి' ట్రైలర్






'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత రామ్ చరణ్ (Ram Charan Upcoming Movie)కు వచ్చిన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా సానా బుచ్చిబాబు కథ, కథనాలు సిద్ధం చేశారట. ఇందులో తన క్యారెక్టర్ మీద రామ్ చరణ్ నమ్మకంగా ఉన్నారు.


చరణ్ పుట్టిన రోజుకు ఫస్ట్ లుక్ రిలీజ్!
ఈ సినిమాలో రోల్ కోసం రామ్ చరణ్ స్పెషల్ మేకోవర్ అవుతున్నారట. ఈ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ (ఫారినర్స్)ను కూడా ఆకట్టుకుంటుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఈ నెల 27న ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.


Also Readనెట్‌ ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ జాతర - జస్ట్ 15 రోజుల్లో 100 సినిమాలు, వెబ్ సిరీస్‌ లు