Inspector Rishi Trailer: శవం చుట్టూ సాలెగూడు, తాంత్రిక పూజలు - ఇంట్రెస్టింగ్‌గా నవీన్ చంద్ర 'ఇన్‌స్పెక్టర్ రిషి' ట్రైలర్

Inspector Rishi Web Series: నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ 'ఇన్‌స్పెక్టర్ రిషి'. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు.

Continues below advertisement

Naveen Chandra's new web series: ఒక వైపు కథానాయకుడిగా, మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్లో అభిమానుల్ని సొంతం చేసుకున్న నటుడు నవీన్ చంద్ర. ఆయన మెయిన్ లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'ఇన్‌స్పెక్టర్ రిషి'. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం తెరకెక్కిన ఒరిజినల్ వెబ్ సిరీస్ ఇది. సూపర్ నేచురల్, హారర్ జానర్ నేపథ్యంలో తీశారు. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి.

Continues below advertisement

శవం చుట్టూ సాలెగూడు...
భయం భయంగా ప్రజలు!
Amazon Prime Original series Inspector Rishi: 'ఇన్‌స్పెక్టర్ రిషి' ట్రైలర్ స్టార్ట్ చేసిన వెంటనే కథలోకి వెళ్లారు దర్శకురాలు నందిని జెఎస్. కొండల మధ్య ఓ అందమైన అటవీ ప్రాంతం. అందులో ఓ ఊరు. అక్కడ చెట్టు మీద శవం. దాని చుట్టూ సాలెగూడు. 

జంతువులు మరణించినప్పుడు, వాటి శవాల చుట్టూ సాలీడు పురుగులు గూడు కట్టడం అసాధారణ విషయం ఏమీ కాదు. అయితే, ఇక్కడ ఓ మనిషి శవం చుట్టూ సాలెగూడు నెలకొంది. అదీ తొలిసారి అటువంటి దృశ్యం కనపడటంతో పోలీసులు కేసును ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. రిషి (నవీన్ చంద్ర)కు ఆ కేసు అప్పగిస్తారు. 'ఇది ఇక్కడితో ఆగదు. ఊరు వల్లకాడు (స్మశానం) అవుతుంది' అని వాయిస్ ఓవర్ వినిపించడం, అటవీ ప్రాంత ప్రజలు పూజలు చేయడం వంటివి సిరీస్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. 

శవం చుట్టూ సాలెగూడు కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? అడవిలో చెట్లు వెనుక కనిపిస్తున్న మాస్క్ మనిషి ఎవరు? చేతబడి చేస్తున్నది ఎవరు? ఈ మరణాల వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయా? లేదంటే సైన్స్ ఏమైనా ఉందా? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. ట్రైలర్ వరకు సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ బావున్నాయి. 

నయా లుక్‌లో నవీన్ చంద్ర...
యాక్టింగ్ కూడా చాలా కొత్తగా!
'ఇన్‌స్పెక్టర్ రిషి' ట్రైలర్ చూస్తే... కొత్త నవీన్ చంద్ర కనిపిస్తారు. లుక్ నుంచి చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ వరకు చాలా కొత్తగా ఉన్నారు. ముఖ్యంగా ఆ కంటి మీద గాటు ఆయన్ను కొత్తగా మార్చింది. తాను కేసును ఇన్వెస్టిగేట్ చేసే తీరు అసాధారణంగా ఉంటుందని, ఎవరేమన్నా తాను పట్టించుకోనని చెప్పే పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో నవీన్ చంద్ర కనిపించారు.

Also Read: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న వైఎస్ వివేకా బయోపిక్ ట్రైలర్ - జగన్‌కు నెగెటివ్ అవుతుందా?

మార్చి 29న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 'ఇన్‌స్పెక్టర్ రిషి'ని ప్రేక్షకులు చూడొచ్చు. ఇందులో నవీన్ చంద్రతో పాటు సునైనా, కన్నా రవి, మాలినీ జీవరత్నం, శ్రీకృష్ణ దయాల్, కుమారవేల్, ఏజెంట్ టీనా నటించారు.

Also Readఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?

Continues below advertisement