Ram Charan 16 Movie Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇది తెలిసిన విషయమే. గత ఏడాది విజయదశమి సందర్భంగా సినిమాను ప్రకటించారు. అయితే... రామ్ చరణ్ పుట్టినరోజు (Ram Charan Birthday Special) సందర్భంగా ఈ సినిమాను మరోసారి కన్ఫర్మ్ చేశారు. రామ్ చరణ్ 16 (RC16) వ చిత్రమిది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నారు. దీనిని యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.


రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు 'ఆర్ఆర్ఆర్' విజయం సాధించిన సందర్భంగా యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు కంగ్రాచ్యులేషన్స్ తెలిపాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారని సమాచారం. అయితే... ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.


Also Read: రామ్ చరణ్‌ను చూసి గర్వపడుతున్నా, మా బావ ఎన్టీఆర్ పవర్ హౌస్! - 'ఆర్ఆర్ఆర్'కు బన్నీ రివ్యూ






ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తయిన తర్వాత గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'ఆచార్య', 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందాలు కొత్త పోస్టర్లు విడుదల చేశాయి. 


Also Read: ఇండియన్ సినిమాల్లో నంబర్ వన్, ప్రపంచవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' ఫ‌స్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?