మీరు ముఖం(Face Wash) కడగకుండా ఎన్నిరోజులు ఉండగలరు? చలికాలంలో ఒకటి రెండు రోజులైతే ఉండవచ్చేమో. వేసవిలో ఒక్క క్షణం కూడా ముఖం శుభ్రం చేసుకోకుండా ఉండలేం. ముఖం శుభ్రంగా లేకపోతే ఎంత చికాకుగా ఉంటుందో తెలిసిందే. అయితే, ఓ హీరోయిన్ మాత్రం తాను అస్సలు ముఖమే శుభ్రం చేసుకోనని, అదే తన బ్యూటీ సీక్రెట్ అని చెప్పడం చర్చనీయంగా మారింది. అదెలా సాధ్యం.. ఫేస్ వాష్ చేసుకోకపోతే క్రిములు చర్మాన్ని పాడుచేయడమే కాకుండా ఇన్ఫెక్షన్లు ఏర్పడే ప్రమాదం ఉంది కదా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలని ఉందా? ఆమె మరెవ్వరో కాదు.. ‘చార్లెస్ ఏంజెల్స్’ నటి కామెరాన్ డియాజ్.


Also Read: రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే ఎన్నేళ్లు బతుకుతారో తెలుసా? ఇది మీరు ఊహించి ఉండరు!


కామెరాన్ ఇటీవల మిచెల్ విసేజ్‌కు చెందిన రూల్ బ్రేకర్స్ పోడ్‌కాస్ట్ కోసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె సంక్లిష్టమైన బ్యూటీ టిప్స్ పాటించినట్లు వెల్లడించింది. ‘‘నేను ఎప్పుడూ ముఖం కడుక్కోను. నాకు లక్ ఉంటే నెలకు రెండు సార్లు కడుగుతానేమో’’ అంటూ షాకిచ్చింది. మరి, షూటింగ్స్ టైమ్‌లో మేకప్ వేసుకుంటే ఏం చేస్తుందని కొంతమంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, కామెరాన్ 2018లోనే సినిమాలకు వీడ్కోలు తెలిపింది. ఇప్పుడు ఆమె వయస్సు 50. ఓ వైన్ కంపెనీ ద్వారా చేతి నిండా సంపాదిస్తోంది. తీరకలేకుండా గడిపేస్తోంది. అయితే, కామెరాన్ వ్యాఖ్యలను చర్మ నిపుణులు ఖండిస్తున్నారు. ఆమెలా ఎవరూ చేయొద్దని, ప్రతి ఒక్కరూ తమ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలని వెల్లడించారు. 






నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మీరు ప్రతి రోజూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మీరు రోజంతా మేకప్ లేకుండా ఇంట్లో ఉన్నా సరే.. ఫేస్ వాష్ చేసుకోవాల్సిందే. చర్మంపై చెమట వల్ల వాతావరణంలోని దూళి ముఖానికి అంటుకుటుంది. మృతకణాలు సైతం ముఖంపై పేరుకుపోతాయి. చర్మం ప్రకాశవంతంగా ఉండాలంటే.. మీరు తప్పకుండా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోతే.. రంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా చర్మం ఇన్ఫెక్షన్‌కు గురవుతుంది. ఆ తర్వాత చర్మం చిట్లిపోయి మంట పుడుతుంది.


Also Read: డయాబెటిస్‌ బాధితులకు ఈ సమ్మర్ పెద్ద సవాలే, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!