Ram Charan Game Changer Movie Leaked Video From Airport: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇంకా కొన్ని రోజుల షూటింగ్ మిగిలి ఉందని ఇటీవల భారతీయుడు 2 మూవీ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ శంకర్ వెల్లడించారు. ఇప్పటికే రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ పూర్తయినట్టు తెలుస్తోంది. అయితే భారతీయుడు 2 రిలీజ్ అయినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. ఇండియన్ 2 మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో గేమ్ ఛేంజర్ మూవీ రిజల్ట్ ఎలా ఉండబోతుందా? అని అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ సెట్ నుంచి మూవీ వీడియో ఒకటి లీక్ అయ్యింది. అప్పటి నుంచి మూవీపై మంచి బజ్ నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. చూస్తుంటే ఇది క్లైమాక్స్ సీన్‌లా ఉంది. ఎయిర్‌పోర్టులో విమానాల మధ్య లోకేషన్ చాలా రిచ్‌గా ఉంది. 'గేమ్ ఛేంజర్' లీక్డ్ వీడియో ఓ నెటిజన్ నెట్టింట పోస్ట్ చేయగా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తుంటే హీరో రామ్ చరణ్ విలన్‌కు మధ్య జరిగే ఓ కీలక సన్నివేశంగా కనిపిస్తోంది. గేమ్ ఛేంజర్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Also Read: పవన్ 'ఓజీ'లో జానపద గాయనికి ఛాన్స్ - తెలుగు ఇండియన్ ఐడల్ 3 స్టేజిపై తమన్ ప్రకటన
ఈ వీడియో విలన్‌లు పోలిటిషయన్‌గా కనిపిస్తుండగా.. చరణ్ ప్రభుత్వ అధికారిగా సూటుబూటులో కనిపించాడు. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఈ సీన్ ఇంటెన్సిటీ, బ్యాగ్రౌండ్ చూసి ఖుష్ అవుతున్నారు. ఈ వీడియోపై ఫ్యాన్స్, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంచలన డైరెక్టర్ శంకర్ దర్శకత్వం, దిల్ రాజు వంటి అగ్రనిర్మాత ఈ సినిమాకు నిర్మిస్తుండటంతో మూవీపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వస్తున్న లీక్డ్ ఫోటోలు, వీడియోలు మరింత ఆసక్తిని పెంచాయి.
అలా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ ముందు నుంచి స్లో స్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తయిన మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు శంకర్ 'ఇండియన్ 2' మూవీ రిలీజ్ నేపథ్యంలో బిజీ అయిపోయారు. ఇక మూవీ రిలీజ్ అయ్యింది. ఇక గేమ్ ఛేంజర్‌పై ఫోకస్ పెట్టి చకచక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఇక మూవీ అవుట్ పుట్ చూసి, పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ పూర్తి చేసి మూవీ రిలీజ్ డేట్ డిసైడ్ చేసి అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ ఏడాదిలోనే గేమ్ ఛేంజర్‌ని రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ స్పష్టం చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో తాజాగా లీకైన ఈ వీడియో మూవీపై మరింత ఆసక్తి పెంచింది.
Also Read: బన్నీ వర్సెస్ సుకుమార్ - గొడవలతో 'పుష్ప 2' షూటింగ్ మళ్లీ వాయిదా?