Allu Arjun Vs Sukumar: 'పుష్ప: ది రూల్' షూటింగ్ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా? అంటే... 'అవును' అని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినబడుతోంది. ఆగస్టు 15న పాన్ ఇండియా రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడటం వెనుక షూటింగ్ చెయ్యడానికి మరింత సమయం కావాలని సుకుమార్ కోరడమే అని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. సినిమా వాయిదా వేసినప్పటికీ... షూటింగ్ సక్రమంగా జరగడం లేదని, దర్శకుడి తీరు మీద బన్నీ గుర్రుగా ఉన్నారని టాక్.
ఫ్యామిలీతో యూరప్ వెళ్లిన అల్లు అర్జున్!
Allu Arjun has trimmed his beard: సుకుమార్ శైలి నచ్చని అల్లు అర్జున్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లారని తెలుస్తోంది. యూరప్ వెళ్లారని టాక్. ఫ్లైట్ జర్నీ సమయంలో ఆయన్ను కొందరు వీడియో తీశారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూస్తే... బన్నీ గడ్డం తీసేశారు. పుష్పరాజ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది 'తగ్గేదే లే' అంటూ గడ్డం కింద చెయ్యి పెట్టుకుని చేసే మ్యానరిజమ్. ఇప్పుడు బన్నీ గడ్డం తీసేస్తే వెంటనే షూటింగ్ చెయ్యడం ఎలా సాధ్యం? అనే క్వశ్చన్ వస్తుంది.
అమెరికాలో సుకుమార్, ఇవాళో రేపో రాక!
ప్రజెంట్ సుకుమార్ కూడా ఇండియాలో లేరు. అమెరికా నుంచి రిటర్న్ జర్నీకి రెడీ అయ్యారు. ఆయన ఫ్యామిలీ కొన్ని రోజులుగా అక్కడ ఉంటోంది. సుక్కు వాళ్ళను చూడటానికి వెళ్లారు. ఇవాళో రేపో ఆయన ఇండియా వస్తారని టాక్. వచ్చిన తర్వాత కొత్త షెడ్యూల్ మీద వర్క్ చేస్తారట. బన్నీ నాలుగైదు రోజుల్లో ఇండియా వస్తారని, త్వరలో 'పుష్ప 2' షూట్ స్టార్ట్ చేస్తారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, అది సాధ్యమా? అనే ప్రశ్న మొదలు అవుతోంది.
గడ్డం ఎందుకు తీసేశావు పుష్ప?
సుకుమార్ మీద కోపంతో బన్నీ గడ్డం తీసేశారని ఇండస్ట్రీ గుసగుస. ఇప్పుడు మళ్ళీ గడ్డం పెరగాలి అంటే మరొక నెల అయినా పడుతుంది. అప్పటి వరకు షూటింగ్ వాయిదా వేస్తే కొత్త రిలీజ్ డేట్ డిసెంబర్ 6కి అయినా సరే రిలీజ్ అవుతుందా? లేదా? అని అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మూడు యూనిట్స్ పెట్టి షూటింగ్ చేద్దామని అల్లు అర్జున్ ప్రపోజ్ చేస్తే సుకుమార్ వద్దని చెప్పారని మరొక గుసగుస. దాంతో 'పుష్ప 2' విషయంలో ఏం జరుగుతోందని ఇండస్ట్రీ సైతం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బన్నీ గడ్డం తీయడం మీద ట్రోల్స్ సైతం వస్తున్నాయి.