Naveen Polishetty: చాలావరకు నటీనటులు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ చూసిన వెంటనే గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని అనుకుంటారు. కానీ కొందరు మాత్రం ఆ సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగించడం కోసం ఆలోచించి అడుగులు వేస్తుంటారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా రెండో కేటగిరికి చెందినవాడే. అందుకే ఏడాది అయినా, రెండేళ్లు అయినా అందరినీ అలరించే కథతోనే ప్రేక్షకుల ముందుకు వస్తాడు. తన సినిమాలు విడుదలయ్యే వరకు పెద్దగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండడు ఈ హీరో. అయితే, నవీన్ పోలిశెట్టికి ఇటీవల యాక్సిడెంట్ జరిగింది. దాని గురించి బుధవారం ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
అవి మాత్రమే నమ్మండి..
‘‘లైవ్ అప్డేట్ ఏంటంటే నా చేతికి పలు ఫ్రాక్చర్స్ అయ్యాయి. కాలికి కూడా గాయమయ్యింది. చాలా కష్టంగా ఉంది. కానీ నాకు వీలైనంత వరకు త్వరగా కోలుకొని మళ్లీ అంతే ఎనర్జీతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సపోర్ట్, ఓర్పు, ప్రేమ మాత్రమే ఇప్పుడు నాకు మెడిసిన్‌లాగా పనిచేస్తుంది. ప్రస్తుతం చాలా ఎగ్జైటింగ్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. నా నుండి వచ్చే అప్డేట్స్‌ను మాత్రమే మీరు నమ్మండి. త్వరలోనే మిమ్మల్ని వెండితెరపై ఎంటర్‌టైన్ చేయడానికి ఎదురుచూస్తున్నాను. మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమించే మీ జానేజిగర్ నాకు ఇది కష్టమైన, బాధాకరమైన సమయం. ముఖ్యంగా నా కెరీర్‌కు ఇది కష్టమైన సమయం ఎందుకంటే దీని వల్ల నేను సినిమాలు చేయలేకపోతున్నాను, మీతో కనెక్ట్ అవ్వలేకపోతున్నాను’’ అని ప్రకటించాడు నవీన్ పోలిశెట్టి.
అదే గుడ్ న్యూస్..
‘‘ఈ గాయాల వల్ల నాకు వీలైనంత త్వరగా సినిమాలు చేయలేకపోతున్నాను. కోలుకోవడం అనేది చాలా మెల్లగా జరుగుతుంది. కానీ నేను డాక్టర్ల సాయంతో వీలైనంత త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దీనికి ఇంకా కొన్ని నెలల సమయం పట్టినా కచ్చితంగా మరింత స్ట్రాంగ్‌గా, ఆరోగ్యంగా తిరిగొస్తాను. గుడ్ న్యూస్ ఏంటంటే నేను నా అప్‌కమింగ్ సినిమాల కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. మీ ప్రేమ, ప్రోత్సాహమే అన్నీ. నా సినిమా షూట్స్‌కు తిరిగి వెళ్లడానికి కూడా అవే మోటివేషన్. మీరు ఎప్పటిలాగానే మీ ప్రేమను కురిపించడానికి సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను’’ అంటూ గాయాలతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు నవీన్ పోలిశెట్టి. ఈ హీరో చివరిగా అనుష్కతో నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో ప్రేక్షకులను అలరించాడు.
Also Read: 'సర్దార్ 2' సెట్‌లో విషాదం - ప్రమాదవశాత్తూ షూటింగ్‌లో స్టంట్ మ్యాన్ మృతి