తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ కథానాయకుడు కార్తీ (Actor Karthi) నటించిన 'సర్దార్' సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ వసూళ్లతో పాటు మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. జూన్ రెండో వారంలో పూజతో లాంఛనంగా 'సర్దార్ 2' (Sardar 2 Movie) చిత్రాన్ని ప్రారంభించారు. సోమవారం (జూలై 15న) చెన్నైలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ సెట్‌లో ప్రమాదవశాత్తూ ఒక స్టంట్ మ్యాన్ మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
20 అడుగుల ఎత్తు నుంచి పడటంతో...
Tragedy on Sardar 2 movie set: చెన్నైలో 'సర్దార్ 2' కోసం స్పెషల్ సెట్ వేశారు. ఆ సెట్‌లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ ఒకటి తెరకెక్కిస్తున్నారు. ఆ షూటింగ్ చేస్తుండగా... ప్రమాదవశాత్తూ ఎళుమలై అనే స్టంట్ మ్యాన్ 20 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడటంతో ప్రాణాలు కోల్పోయాడు. దాంతో యూనిట్ అంతా ఒక్కసారి షాక్ తిన్నది.
'సర్దార్ 2' చిత్రీకరణలో జరిగిన ప్రమాదం మీద చెన్నైలోని విరుగంబాక్కమ్ స్టేషన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ప్రమాదంతో స్టంట్ సీక్వెన్సులు తీసే సమయంలో మూవీ యూనిట్స్ తీసుకునే సేఫ్టీ ప్రికాషన్స్ మీద మరొకసారి చర్చ మొదలు అవుతోంది.
Also Read: బన్నీ వర్సెస్ సుకుమార్ - గొడవలతో 'పుష్ప 2' షూటింగ్ మళ్లీ వాయిదా?
విలన్ రోల్ చేస్తున్న ఎస్.జె. సూర్య
SJ Surya Joins Sardar 2 Cast: 'సర్దార్' తీసిన పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో 'సర్దార్ 2' కూడా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, స్టంట్ మ్యాన్ మృతికి ముందు చిత్ర బృందం ఓ ఎగ్జైటెడ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో ఎస్.జె. సూర్య విలన్ రోల్ చేస్తున్నట్టు తెలియజేసింది.
Sardar 2 Cast And Crew: కార్తీ కథానాయకుడిగా, ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్న 'సర్దార్ 2' చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. ఇంకా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జార్జ్ సి విలియమ్స్, స్టంట్ డైరెక్టర్: దిలీప్ సుబ్బరాయన్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నంబియార్, ఎడిటర్: విజయ్ వేలుకుట్టి, సహ నిర్మాత: ఎ వెంకటేష్, నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్, దర్శకత్వం: పీఎస్ మిత్రన్.
Also Read: శేఖర్ మాస్టర్ ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నాడు - ఆయనే అమ్మాయిలతో పులిహోర కలిపేస్తున్నాడు!