Ram Charan At USA : అమెరికాలో అయ్యప్ప మాల తీసిన రామ్ చరణ్

గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన రామ్ చరణ్ (Ram Charan), తనను చూడడానికి వచ్చిన అభిమానులకు సెల్ఫీలు ఇచ్చారు. ఆయన అయ్యప్ప మాల తీసి, స్టైలిష్ లుక్ లోకి వచ్చారు. 

Continues below advertisement

రామ్ చరణ్ స్టైలిష్ లుక్ (Ram Charan New Look) లోకి వచ్చారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ అమెరికాలో ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ వెళ్ళే ముందు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అయ్యప్ప మాలలో కనిపించారు. చెప్పులు లేకుండా విమానం ఎక్కారు. ఇప్పుడు మాలాధారణలో లేరు.

Continues below advertisement

అమెరికాలో అయ్యప్ప మాల తీసిన చరణ్
Ram Charan Removes Ayyappa Mala : అమెరికాలోని ఓ ఆలయంలో రామ్ చరణ్ అయ్యప్ప మాల తీసినట్లు తెలిసింది. హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్, అభిమానులతో ఫోటో షూట్, శంకర్ దర్శకత్వంలోని సినిమా సాంగ్ షూట్... ఎప్పుడు చూసినా చరణ్ మాలలో కనిపించారు. ఇప్పుడు మళ్ళీ స్టైలిష్ లోకి వచ్చేశారు. 

అమెరికాలో చరణ్ కోసం వచ్చిన ఫ్యాన్స్!
గుడ్ మార్నింగ్ అమెరికా (Good Morning America)... పాపులర్ టీవీ షో. అమెరికన్స్ ఎక్కువగా చూసే టెలివిజన్ కార్యక్రమాల్లో ఇదొకటి. ఇప్పుడీ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హాజరు అయ్యారు. ఆ కార్యక్రమానికి వెళ్ళిన ఆయన్ను చూడటానికి అమెరికాలో ఫ్యాన్స్ వచ్చారు. వాళ్ళతో చరణ్ సెల్ఫీలు దిగారు, ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : షూటింగులోనూ సేమ్ టీ గ్లాసుతో పవర్ స్టార్ - కొత్త సినిమాలో లుక్ చూశారా?

టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో కూడా!
టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో, ర్యాన్ రెనాల్డ్స్ వంటి హాలీవుడ్ టాప్ హీరోలు 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో సందడి చేశారు. ఇండియా నుంచి న్యూ ఏజ్ స్టార్స్ ఈ షోకి వెళ్ళడం రామ్ చరణ్ (Ram Charan)తోనే మొదలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి తెలుగు హీరో, న్యూ ఏజ్ ఇండియన్ స్టార్ ఆయనే. ఈ విషయంలో చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు. 

Also Read : చిరంజీవి రేసులో ఇద్దరు దర్శకులు - ఛాన్స్ ఎవరికో?

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సంస్థ ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమాల్లో అత్యుత్తమ సినిమాలను గుర్తించి అవార్డులు అందజేస్తుంది. ఈ ఏడాది హెచ్.సి.ఎ అవార్డులకు నాలుగు విభాగాల్లో నామినేట్ అయ్యింది.

సినిమా, దర్శకత్వం, అంతర్జాతీయ సినిమా, యాక్షన్ ఫిల్మ్ విభాగాల్లో హాలీవుడ్ సినిమాలతో 'ఆర్ఆర్ఆర్' పోటీ పడుతోంది. అవార్డులు ఏయే విభాగాల్లో వస్తాయి? అనేది ఈ నెల 24న బెవర్లీ హిల్స్ లో జరుగుతున్న కార్యక్రమంలో తెలుస్తుంది. అసలు విషయం కాదు... ఆ పురస్కారాల కార్యక్రమంలో వేదికపై రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఆయన్ను ప్రజెంటర్ గా హెచ్.సి.ఎ ఆహ్వానించింది. అదీ సంగతి! హెచ్.సి.ఎ అవార్డుల్లోని విజేతలలో ఒకరిని రామ్ చరణ్ అవార్డు ఇవ్వనున్నారు. ఆ ఘనత అందుకున్న తొలి హీరోగా ఆయన రికార్డ్ క్రియేట్ చేయనున్నారు.

అమెరికాలో చరణ్ ఫాలోయింగ్ చూస్తే...
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలోని 'నాటు నాటు...' (Naatu Naatu Song) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ట్రెండ్ చూస్తే అవార్డు మన తెలుగు పాటకు రావడం పక్కా అని చెప్పవచ్చు. ఇంతకు ముందు గోల్డెన్ గ్లోబ్ (golden globe awards 2023 winners) పురస్కారాల్లో కూడా 'నాటు నాటు...' అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

Continues below advertisement