రజనీకాంత్ వర్సెస్ ఎన్టీఆర్... కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్... దేవర వర్సెస్ వేట్టయాన్... ఎలాగైనా అనుకోండి. ఏ విధంగా అయినా చూసుకోండి. ఈ ఏడాది విజయదశమికి థియేటర్లలో సందడి మామూలుగా ఉండదు. ఒకటికి రెండు భారీ సినిమాలు పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దసరా మీద టాలీవుడ్ యంగ్ స్టార్ ఎప్పుడో కర్చీఫ్ వేస్తే... ఇప్పుడు కోలీవుడ్ స్టార్ వచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...


అక్టోబర్ 10న 'దేవర'తో పాటు 'వేట్టయాన్' కూడా!
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'దేవర'. తొలుత ఓ సినిమా అని మొదలు పెట్టినా, తర్వాతర్వాత రెండు భాగాలుగా విడుదల చెయ్యాలని డిసైడ్ అయ్యారు. దేవర ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న విడుదల చెయ్యనున్న విషయం తెలిసిందే. దసరా బరిలో ఎన్టీఆర్ సినిమాకు అడ్డు లేదని అనుకున్నారు ఫ్యాన్స్. ఆ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే సమయానికి మరో సినిమా లేదు. ఇప్పుడు రజనీకాంత్ వచ్చి చేరడంతో పోటీ రసవత్తరంగా మారింది. 


సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'వేట్టయాన్'. దీనికి సూర్య 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 12న రిలీజ్ కానున్న కమల్ హాసన్ 'ఇండియన్ 2'తో పాటు ఇంతకు ముందు ఎన్నో పాన్ ఇండియా ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. లేటెస్టుగా ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చెయ్యనున్నట్టు రజనీకాంత్ స్వయంగా చెప్పారు. దాంతో దసరా బరిలో దేవర వర్సెస్ వేట్టయాన్ కాంపిటీషన్ ఆడియన్స్ చూడనున్నారు.


రెండు సినిమాల్లోనూ హ్యుజ్ స్టార్ కాస్ట్!
'దేవర'లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తుంటే... 'వేట్టయాన్'లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 32 ఏళ్ల తర్వాత రజనితో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్నారు. 'దేవర'లో జాన్వీ కపూర్ హీరోయిన్ అయితే... 'వేట్టయాన్' సినిమాలో టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, మాలీవుడ్ స్టార్స్ ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ కీలక తారాగణం.


Also Readకాజల్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన శంకర్ - Indian 2 ఆడియోలో చందమామ పాత్రపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు


దేశానికి ఆస్కార్ తెచ్చిన ఘనత మూట కట్టుకున్న 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాగా 'దేవర'కు క్రేజ్ ఉంటే... భారీ సక్సెస్ సాధించిన 'జైలర్' తర్వాత రజనీకాంత్ పూర్తి స్థాయి సోలో హీరోగా యాక్ట్ చేస్తున్న సినిమా 'వేట్టయాన్'. రెండు సినిమాలకూ పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ నెలకొంది. మరి, ఆ రెండు మూవీస్ మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు... రెండు సినిమాలకూ సంగీత దర్శకుడు ఒక్కరే అనిరుధ్ రవిచందర్. దసరా బరిలో బాలీవుడ్ నుంచి మినిమమ్ ఒక్క మూవీ అయినా వచ్చేలా ఉంది.


Also Read: రెహమాన్ మ్యూజిక్, 'భారతీయుడు'తో కంపేరిజన్ - Indian 2 ఆడియో లాంచ్‌లో అనిరుధ్ రియాక్షన్