Anirudh Ravichander reacts on Indian 2 songs feedback: అనిరుధ్ రవిచందర్... కోలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక ఉన్న సంగీత దర్శకుడు. లోక నాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్', సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' విజయాల్లో సంగీతం కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. షారుఖ్ ఖాన్ 'జవాన్' విజయానికీ అనిరుధ్ సంగీతం ఓ కారణం. 'విక్రమ్' తర్వాత కమల్ 'ఇండియన్ 2' సినిమాకూ ఆయన సంగీతం అందించారు. అయితే... రెహమాన్ 'ఇండియన్' / 'భారతీయుడు' పాటల స్థాయిలో అనిరుధ్ పాటలు లేవని కొందరు పెదవి విరిచారు. ఆ కంపేరిజన్ మీద 'ఇండియన్ 2' ఆడియో ఆవిష్కరణ వేడుకలో యువ సంగీత సంచలనం స్పందించాడు.


రెహమాన్ తర్వాతే ఎవరైనా - అనిరుధ్
Anirudh On AR Rahman: 'ఇండియన్ 2' పాటలను, 'ఇండియన్' పాటలను కొంత మంది కంపేర్ చేస్తుంటే మీకు ఏమని అనిపిస్తోంది? అని ఆడియో వేడుకలో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)ను యాంకర్ ప్రశ్నించారు. అప్పుడు అనిరుధ్ ఏమన్నాడో తెలుసా? ''ఆరు తర్వాత ఏడు వస్తుంది. రెహమాన్ తర్వాత ఎవరు? అంటే ఎవరూ లేరు. నాకు రెహమాన్ గారు ఇన్స్పిరేషన్. ఆయన స్ఫూర్తితో సంగీతం నేర్చుకున్నాను. సంగీత దర్శకుడు అయ్యాను. రెహమాన్ సార్ తరహాలో పాటలు ఇస్తాననే నమ్మకంతో శంకర్ గారు నన్ను తీసుకున్నారు. ఆయన నమ్మకాన్ని నేను నిలబెట్టానని అనుకుంటున్నాను'' అని అనిరుధ్ చెప్పారు. ఆడియో ఆవిష్కరణలో ఆయన ఇచ్చిన లైవ్ పెర్ఫార్మన్స్ అందర్నీ ఆకట్టుకుంది.


Also Read: పిఠాపురంలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన శర్వా - Election Results 2024 వచ్చిన నెక్ట్స్ డే రామ్ చరణ్ అతిథిగా?


ఏఆర్ రెహమాన్, శంకర్ కాంబినేషన్ అంటే సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ గ్యారంటీ. ఆ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాల్లో పాటలు కేవలం తమిళ ప్రేక్షకులనే కాదు, తెలుగు & హిందీ జనాల్ని సైతం ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ కాకముందు రెహమాన్, శంకర్ ఆ స్థాయి సినిమాలతో మేజిక్ చేశారు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన 'ఇండియన్' (తెలుగులో 'భారతీయుడు')కు రెహమాన్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. 'ఇండియన్ 2'కు అనిరుధ్ వచ్చి చేరాడు.


Also Readకాజల్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన శంకర్ - Indian 2 ఆడియోలో చందమామ పాత్రపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు



ఇప్పుడు అనిరుధ్ చేతిలో ఏం సినిమాలు ఉన్నాయో తెలుసా?
Upcoming movies of Anirudh Ravichander: ఇప్పుడు అనిరుధ్ చేతిలో ఉన్నవి అన్నీ భారీ సినిమాలే. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'దేవర'కు ఆయన మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంకా రజనీకాంత్ 'వెట్టయాన్', విజయ్ దేవరకొండ & గౌతమ్ తిన్ననూరి సినిమా, అజిత్ 'విదా ముయార్చి', శివకార్తికేయన్ సినిమా, కమల్ హాసన్ 'ఇండియన్ 3' ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి కోసం ఆయన తెరకెక్కించిన ఓ చిన్న సినిమా కూడా చేశారు.